Big Stories

Check For Health Problems With Onions : ఉల్లితో అనారోగ్య సమస్యలకు చెక్‌

Check For Health Problems With Onions : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదంటారు. ఎందుకంటే ఉల్లిపాయలో మన శరీరానికి అంతర్గతంగా, బహిర్గతంగా అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఉల్లిని ఉడికించి లేదా పచ్చిది తినడం వల్ల ఈ ప్రయోజనాలను పొందడమే కాకుండా వ్యాధి వచ్చిన ప్రదేశంలో రాయవచ్చు. అనేక ఆరోగ్య సమస్యలను సహజంగా నయం చేసే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉల్లిపాయలో ఉన్నాయి. ఉల్లితో వాంతులు, దగ్గు, జలుబు, చాతీ నొప్పి, రొమ్ము పడిశము, చెవి నొప్పి, పొట్టనొప్పి మాయం అవుతుంది. ఉల్లిపాయను రెండుగా కట్ చేసుకోవాలి, అందులో ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి, ఇప్పుడు రెండు భాగాలను మూసివేసి ఒక జార్లో పెట్టాలి. గంట తర్వాత బయటకు తీసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గును నివారిస్తుంది. జ్వరం ఉన్నప్పుడు ఉల్లిపాయ హైబాడీ టెంపరేచర్‌ను తగ్గిస్తుంది. ఉల్లిని రెండు భాగాలుగా కట్ చేసి సగం ఒక కాలి పాదం క్రింద, మరోకటి మరో కాలి పాదం కింద ఉంచాలి. తర్వాత సాక్సులు ధరించి రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేస్తే జ్వరం త్వరగా తగ్గిపోతుంది. ఈ ఉల్లిపాయలు శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తాయి. వాంతులు తగ్గాలంటే ఉల్లిపాయల నుంచి రసాన్ని తీసుకోవాలి. పుదీనా టీ తయారు చేసి 2 చెంచాల ఉల్లి రసాన్నితాగి ఆ తర్వాత 2 చెంచాల చల్లటి పుదీనా టీ తాగాలి. 5 నిమిషాల తర్వాత ఇలాగే చేయాలి. ఇలా చేస్తే వాంతులు తొందరగా తగ్గిపోతాయి. గాయాలకు కూడా ఉల్లి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయను కోసి ఔటర్ స్కిన్‌ను తెగిన గాయం చుట్టూ చుట్టాలి. ఇలా చేస్తే రక్తస్రావం వెంటనే తగ్గిపోతుంది. అంతేకాకుండా గాయం చుట్టూ క్రిములు చేరకుండా ఆపుతుంది. ఉల్లిపాయను పేస్ట్ చేసుకుని కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి. దీన్ని చాతిమీద అప్లై చేసి టవల్‌ను కప్పాలి. రాత్రుల్లో ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు, కఫం తగ్గుతుంది. చెవి నొప్పి, ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఉల్లి బాగా పనిచేస్తుంది. ఉల్లి పేస్ట్‌ను నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి గుడ్డతో చుట్టేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిల్లల కడుపునొప్పిని తగ్గిస్తుంది. ఉల్లిపాయను కొద్దిగా నీటిలో వేసి ఉడికించాలి, చల్లారిన తర్వాత ఈ వాటర్‌ను ఒక చెంచా పిల్లలకు తాగిస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News