OTT Movie : కామెడీ జానర్ లో వచ్చే హారర్ సినిమాలు చాలా ఫన్నీ గా ఉంటాయి. ఒకవైపు భయపెడుతూ, మరోవైపు నవ్విస్తూ ప్రేక్షకులకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాయి. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కొంతమంది బ్యాండ్ సభ్యులు ఒక మాన్షన్‌లో అతీంద్రియ శక్తులతో పోరాడుతూ ఆల్బమ్ రికార్డింగ్‌ను చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్టోరీ రాక్ అండ్ రోల్ వైబ్‌తో నడుస్తుంది. ఈ స్టోరీ ఏమిటి ? ఈ సినిమా పేరు ? ఎందులో వుంది అనే వివరాల్లోకి వెళ్తే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘స్టూడియో 666’ (Studio 666) 2022లో విడుదలైన అమెరికన్ హారర్-కామెడీ చిత్రం. బి.జె. మెక్‌డొనెల్ దర్శకత్వంలో, డేవ్ గ్రోల్ కథ ఆధారంగా రూపొందింది. 2022 ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలై, 2022 మార్చి18 నుండి నెట్‌ఫ్లిక్స్, ఆపిల్ టీవీ, ఫండాంగో లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమా 5.6/10 రేటింగ్ ను పొందింది.
స్టోరీలోకి వెళ్తే …
ఫూ ఫైటర్స్, ఒక ఫేమస్ రాక్ బ్యాండ్. వాళ్ల 10వ ఆల్బమ్ రికార్డ్ చేయడానికి ఎన్సినోలోని ఒక పాత మాన్షన్‌లోకి వెళ్తారు. ఈ ఇల్లు గతంలో ఒక రాక్ బ్యాండ్‌కి సంబంధించిన భయంకరమైన హత్యల చరిత్ర కలిగి ఉంటుంది. బ్యాండ్ లీడర్ డేవ్ గ్రోల్ కొత్త పాటలు రాయలేక ఇబ్బంది పడుతుంటాడు. కానీ ఈ ఇంట్లో అతను ఒక వింత రికార్డింగ్ టేప్‌ను కనుగొంటాడు. అది 90లలో అదృశ్యమైన డ్రీమ్ విడో అనే బ్యాండ్‌ది. ఈ టేప్ విన్న తర్వాత, డేవ్‌కి ఒక అద్భుతమైన గిటార్ సోలో ఐడియా వస్తుంది. కానీ అదే సమయంలో అతనికి ఒక దెయ్యం ఆవహిస్తుంది.
ఈ దెయ్యం బ్యాండ్‌ని, వాళ్ల ఆల్బమ్‌ని, వాళ్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఈ సినిమా ఒక హారర్-కామెడీ, ఇందులో డేవ్ అతని బ్యాండ్ సభ్యులు దెయ్యాలతో పోరాడుతూ, ఒక విచిత్రమైన రైడ్‌లోకి వెళ్తారు. అక్కడ రక్తపాతంతో పాటు కామెడీ సీన్స్ తో స్టోరీ ఒక ఫన్ రైడ్ ని ఇస్తుంది. క్లైమాక్స్ లో ఈ స్టోరీ ఊహించని ట్విస్ట్ తో ముగుస్తుంది. ఆ దెయ్యం ఎవరు ? ఆటేప్ లో ఎందుకుంది ? ఫూ ఫైటర్స్ఏమవుతారు ? విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, ఈ అమెరికన్ హారర్-కామెడీ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : కాబోయే భర్తను వదిలేసి మరో అమ్మాయితో… ఇద్దరమ్మాయిల అరాచకం… ఇండియాలో బ్యాన్ చేసిన మూవీ