BigTV English

OTT Movie : హోమ్ మంత్రి కొడుకు మిస్సింగ్స్… గరుడ పురాణంతో లింక్… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : హోమ్ మంత్రి కొడుకు మిస్సింగ్స్… గరుడ పురాణంతో లింక్… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ ఉన్న కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie  : ఓటీటీలోకి సరికొత్త స్టోరీలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, పోటీపడి దక్కించుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఒక వ్యక్తి మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. సస్పెన్స్ తో ఈ సినిమా ఒక మరచిపోలేని ఎనర్టైన్మెంట్ ఇస్తుంది. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే


జియో హాట్ స్టార్ లో

‘రుద్ర గరుడ పురాణం’ (Rudra Garuda Purana) 2025లో విడుదలైన కన్నడ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. కె.ఎస్. నందీశ్ దర్శకత్వంలో, అశ్విని లోహిత్ నిర్మాణంలో, అశ్విని ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఇందులో రిషి, ప్రియాంక కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, వినోద్ ఆళ్వ, అవినాష్, ప్రభాకర్, శివరాజ్ కె.ఆర్. పేట్, అశ్విని గౌడ, గిరి శివన్న సహాయక పాత్రల్లో నటించారు. ఈసినిమా 2025 జనవరి 24న థియేటర్‌లలో విడుదలైంది. IMDbలో 5.5/10 లో రేటింగ్ ను పొందింది. జియో హాట్ స్టార్ లో ఈ సినిమా తొందర్లో వచ్చే అవకాశం ఉంది.


కథలోకి వెళ్తే

మను రాష్ట్ర హోమ్ మినిస్టర్ దేవి శెట్టి కొడుకు. కాలేజీ నుంచి ఇంటికి వస్తూ అకస్మాత్తుగా మాయమైపోతాడు. దేవి శెట్టి ప్రస్తుతం పొలిటికల్ గొడవల్లో చిక్కుకున్నాడు. ఒక రోజు అతని ఇంటి కిటికీపై గరుడ పురాణం శ్లోకంతో ఒక లేఖను చుట్టిన రాయిని విసురుతారు. ఈ కేసును రహస్యంగా ఛేదించమని రుద్ర అనే ఒక ధైర్యమైన కాప్‌ను పిలుస్తారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో మైసూర్‌లో మను కనిపించిన 17A కావేరి ఎక్స్‌ప్రెస్ బస్సు జాడను వెతుకుతాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే, ఈ బస్ 25 సంవత్సరాల క్రితం ఒక భయంకర ప్రమాదంలో పనికిరాకుండా పోయింది. అందులో ప్రయాణించిన అందరూ చనిపోయారు. ఇప్పుడు ఈ బస్సు ఎలా తిరిగి వచ్చింది? అనే సందేహం రుద్రని గందరగోళంలో పడేస్తుంది.

రుద్ర తన స్నేహితుడు గోవిందు, దివ్య అనే తనకు ఇష్టమైన అమ్మాయి సపోర్ట్‌తో, ఈ రహస్యాన్ని ఛేదించడానికి సక్లేష్‌పూర్ వరకు వెళ్తాడు. అక్కడ అతనికి ఒక దిమ్మతిరిగే విషం తెలుస్తుంది. ఈ బస్సు ప్రమాదం వెనుక డ్రైవర్ తప్పు కాదు, పొలిటికల్ కుట్రలు, బ్లాక్ మ్యాజిక్ ఉన్నాయని. క్లైమాక్స్‌లో, సక్లేష్‌పూర్‌లోని ప్రమాద స్థలంలో గతం, వర్తమానం కలిసి, మను అదృశ్యం 25 ఏళ్ల క్రితం చనిపోయిన వారితో లింక్ అని బయటపడుతుంది. ఇక ఈ స్టోరీ ఒక ఊహించని ట్విస్ట్‌తో ముగుస్తుంది. మను మిస్సింగ్ వెనుక అసలు కథ ఏమిటి ? రుద్ర ఈ కేసుని ఎలా డీల్ చేస్తాడు ? ఆ బస్సు మిస్టరీ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : ఈ ఊళ్ళో అమ్మాయిలతో మెచ్యూర్ అయిన వెంటనే ఆ పని… 100 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ తో లింక్… ఆ 10 నిముషాలు హైలెట్

Related News

OTT Movie : శపించబడిన మాన్షన్‌లో షూటింగ్… ఈవిల్ డెడ్ ను మించిన డేంజర్ సీన్లు… ఈ మూవీ ఏంటి భయ్యా ఇంత బ్రూటల్ గా ఉంది?

OTT Movie : మాన్స్టర్ గా మారినా మమకారం మరువని తల్లి… కన్నీళ్లు పెట్టించే కొరియన్ కథ… సీను సీనుకో ట్విస్ట్ సామీ

OTT Movie : భర్తనే ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్… కట్టుకున్నోన్ని వదిలేసి ఆటగాడితో… వాడిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : ఆరుగురు అమ్మాయిల అడ్వంచర్… కేవ్ లో కేక పెట్టించే హర్రర్ సీన్స్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : బాబోయ్… ఏకంగా 236 మిలియన్ వ్యూస్… ఓటీటీలో గత్తర లేపుతున్న సినిమా

Big Stories

×