OTT Movie : మాన్స్టర్ గా మారినా మమకారం మరువని తల్లి… కన్నీళ్లు పెట్టించే కొరియన్ కథ… సీను సీనుకో ట్విస్ట్ సామీ ఒక కొరియన్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సిరీస్ దక్షిణ కొరియాలో మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశం, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, తైవాన్‌తో సహా 20 దేశాలలో టాప్ 10లో చోటు సంపాదించింది. ఈ సిరీస్ 1945లో జపాన్ ఆక్రమణలో ఉన్న గ్యాంగ్‌సియాంగ్ (పాత సియోల్) నేపథ్యంలో జరుగుతుంది. ఈ సిరీస్ జపాన్ సైన్యం చేసిన రహస్య బయోలాజికల్ ప్రయోగాలు, జనంపై జరిపిన క్రూరత్వాలు, ఒక రాక్షస జీవి చుట్టూ తిరిగే కథను చూపిస్తుంది. ఇందులో జపాన్ సైన్యం రెండవ ప్రపంచ యుద్ధంలో సివిలియన్లపై బయోలాజికల్ ఆయుధాల ప్రయోగాలు చేయడంతో ఎంతోమంది చనిపోయారు. దీని ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ లో
‘గ్యాంగ్‌సియాంగ్ క్రీచర్’ (Gyeogseong creature) కొరియన్ హిస్టారికల్ మిస్టరీ-హారర్ సిరీస్. ఇది జంగ్ డాంగ్-యూన్, రో యంగ్-సబ్, జో యంగ్-మిన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో పార్క్ సియో-జూన్, హాన్ సో-హీ, క్లాడియా కిమ్, లీ మూ-సాంగ్, బే హ్యూన్-సంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది నెట్‌ఫ్లిక్స్ లో విడుదలై, గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ టీవీ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. సీజన్ 1 రెండు భాగాలుగా (7 + 3 ఎపిసోడ్‌లు) 2023 డిసెంబర్ 22 విడుదల కాగా, సీజన్ 2 (7 ఎపిసోడ్‌లు) 2024 సెప్టెంబర్ 27న విడుదలైంది. IMDbలో 7.3/10 రేటింగ్ ని పొందింది.
స్టోరీలోకి వెళ్తే
1945లో జపాన్ ఆక్రమణలో ఉన్న గ్యాంగ్‌సియాంగ్‌లో కథ మొదలవుతుంది. జాంగ్ టే-సాంగ్ ఒక ధనవంతుడు, గ్యాంగ్‌సియాంగ్‌లోని అతిపెద్ద పాన్‌షాప్ “హౌస్ ఆఫ్ గోల్డెన్ ట్రెజర్” యజమాని, నగరంలో ఏ సమాచారమైనా సమకూర్చే ఇన్ఫర్మెంట్. అతను జపనీస్ ఆక్రమణకు ఎదురుతిరగకుండా, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. యూన్ చే-ఓక్ తన తల్లి సీయోంగ్-సిమ్ కోసం 10 సంవత్సరాలుగా వెతుకుతుంటుంది. తన తండ్రి యూన్ జంగ్-వాన్ తో కలిసి గ్యాంగ్‌సియాంగ్‌కు వస్తుంది. ఈ క్రమంలో టే-సాంగ్, చే-ఓక్‌లు ఒకరి మార్గంలో ఒకరు కలుస్తారు. ఒక ఒప్పందం కుదుర్చుకుని, ఓంగ్‌సియాంగ్ హాస్పిటల్‌లో జరుగుతున్న రహస్య ప్రయోగాలను బయటపెట్టడానికి కలిసి పనిచేస్తారు. ఈ హాస్పిటల్‌లో జపనీస్ జనరల్ కాటో డైరెక్టర్ ఇచిరో నేతృత్వంలో, నాజిన్ అనే పరాన్నజీవిని ఉపయోగించి మానవులపై భయంకరమైన ప్రయోగాలు జరుగుతుంటాయి. ఇది ఆంత్రాక్స్‌తో కలిసినప్పుడు ఒక రాక్షస జీవిని సృష్టిస్తుంది.
చే-ఓక్ తల్లి సీయోంగ్-సిమ్ ఈ ప్రయోగాలకు బలై, గ్యాంగ్‌సియాంగ్ క్రీచర్‌గా మారుతుందని తెలుస్తుంది. ఆమె శరీరంలో నాజిన్, ఆంత్రాక్స్ కలవడం వల్ల భయంకరమైన శక్తులు వస్తాయి. సీజన్ 1లో, టే-సాంగ్, చే-ఓక్ హాస్పిటల్‌లోకి చొరబడి ఈ రాక్షస జీవి, జపనీస్ క్రూరత్వాలను ఎదిరిస్తారు. సీయోంగ్-సిమ్ తన కూతురిని రక్షించడానికి తన మానవ స్వభావాన్ని గుర్తుచేసుకుని, జపనీస్ సైనికులపై దాడి చేస్తుంది. కానీ చివరకు చే-ఓక్‌ను రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది. అయితే చే-ఓక్‌కు కూడా ఇలాంటి శక్తి వస్తుంది. దీంతో ఆమె ఈ సైనికులపై రెచ్చిపోతుంది. సీజన్ 1 ముగింపులో చే-ఓక్ మరణిస్తుంది. కానీ ఆమె అమరత్వంతో తిరిగి బ్రతికిస్తుంది.
Read Also : కాబోయే భర్తను వదిలేసి మరో అమ్మాయితో… ఇద్దరమ్మాయిల అరాచకం… ఇండియాలో బ్యాన్ చేసిన మూవీ