BigTV English

Rizwan : పాక్ క్రికెటర్ ను పొట్టు పొట్టుగా కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్‌వాల్

Rizwan : పాక్ క్రికెటర్ ను పొట్టు పొట్టుగా కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్‌వాల్

Rizwan :  సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం కష్టమనే చెప్పాలి. ఆటగాళ్ల ఫామ్ ని పక్కకు పెడితే.. కొంత మంది ఆటగాళ్లు క్రమశిక్షణ కూడా తప్పుతుంటారు. కొందరూ తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటారు. తాజాగా పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్ ని వెస్టిండీస్ క్రికెటర్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా రెండు వేర్వేరు జట్ల క్రికెటర్లు కొట్టుకోవడం ఇది కొత్తేమి కాదు. మ్యాచ్ జరుగుతున్నసమయంలో ఇరు జట్ల క్రికెటర్లు వాదోపవాదాలు జరుగుతుంటాయి. కానీ కొట్టుకోవడం వంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ రిజ్వాన్ ను వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్ వాల్ చితకబాదాడు.


Also Read : RCB Sarees : RCB పేరుతో చీరలు… క్రేజ్ మామూలుగా లేదుగా.. 11 మంది డెడ్ బాడీ లు ఎక్కడ అంటూ ట్రోలింగ్

రిజ్వాన్ ని చితక బాదిన రహ్కీమ్ కార్న్‌వాల్


ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటిగ్వా మరియు బార్బుడా ఫాల్కన్స్ వర్సెస్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ABF విజయం సాధించింది. SNP ఓటమి పాలైంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన SNP జట్టు 133 పరుగులు మాత్రమే చేసింది. SNP ఆటగాళ్లు తొలుత లూయిస్ 32, ఆండ్రీ ఫ్లెచర్ 16, రస్సౌ 10, రిజ్వాన్ 30, మేయర్స్ 18, హోల్డర్ 09, నవీన్ బిడైస్ 1, అబ్బాస్ అఫ్రిది 08, నషీమ్ షా 4 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 133 పరుగులు చేయగలిగింది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ABF  జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరగడంతో పాకిస్తాన్ క్రికెటర్ రిజ్వాన్ ని వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్ వాల్ కొట్టాడు.

విజయం సాధించిన ABF

ముఖ్యంగా ABF బ్యాటర్లు జువెల్ ఆండ్రూ 28 బంతుల్లో 28 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రహ్కీమ్ కార్న్ వాల్  13 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అయితే ఓపెనర్ల ఇద్దరినీ రిజ్వాన్ ఔట్ చేయడం విశేషం. జువెల్ ఆండ్రూను స్టంప్ ఔట్ చేసినందుకా..? లేక అతని క్యాచ్ ఔట్ పట్టినందుకో తెలియదు కానీ.. రిజ్వాన్ ను మాత్రం చితకబాదాడు.  ఈ ఘటన తరువాత కరిమా గోరె 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. షకీబ్ ఉల్ హాసన్ 225, ఆండ్రీ గౌస్ 09 పరుగులు చేశారు. అష్మద్ నీడ్ 1, వాఖర్ సలామ్ ఖైల్ 1, బడైసీ 1 వికెట్ తీశారు. మొత్తానికి కార్న్ వాల్ పాకిస్తాన్ క్రికెటర్ రిజ్వాన్ ని కొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Related News

RCB Sarees : RCB పేరుతో చీరలు… క్రేజ్ మామూలుగా లేదుగా.. 11 మంది డెడ్ బాడీ లు ఎక్కడ అంటూ ట్రోలింగ్

Rinku Singh’s Wedding : రింకు సింగ్ పెళ్ళికి షారుక్ ఖాన్.. కోట్లల్లో గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ ?

Ravichandran Ashwin : అశ్విన్ రిటైర్మెంట్… CSKకు 10 కోట్ల లాభం… రంగంలోకి కాటేరమ్మ కొడుకు?

Romario Shepherd: ఒక్క బాల్‌కు 22 రన్స్.. RCB ప్లేయర్ అరాచకం

Mark Wood : రోహిత్ శర్మకు బౌలింగ్ వేయడం నా వల్ల కాదు.. ఇంగ్లాండ్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×