Big Stories

Digital Rupee : డిజిటల్ రూపాయి వచ్చేసింది!

Digital Rupee : దేశంలో డిజిటల్ రుపీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది… RBI. అయితే దీన్ని అందరి కోసం కాకుండా… టోకు అవసరాలకు వినియోగించే వారి కోసం మాత్రమే ప్రారంభించింది. సెకండరీ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో డిజిటల్ రుపీ లావాదేవీలు జరపడం ద్వారా ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వాలన్న లక్ష్యంతోనే… డిజిటల్ రుపీని ప్రవేశపెట్టామంటోంది… RBI.

- Advertisement -

SBI, BOB, UBI, HDFC BANK, ICICI BANK, KOTAK MAHINDRA BANK, YES BANK, IDFC FIRST BANK, HSBC ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్నాయి. రిటైల్‌ అవసరాల కోసం మరో నెల రోజుల్లో డిజిటల్‌ రూపాయిని ప్రారంభింస్తామని RBI తెలిపింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో వ్యాపారులు, వినియోగదారుల మధ్య డిజిటల్ రుపీ లావాదేవీలు జరుగుతాయని వెల్లడించింది.

- Advertisement -

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ-CBDCగా వ్యవహరించే ఇ-రుపీపై కాన్సెప్ట్‌ నోట్‌ను RBI గతంలోనే విడుదల చేసింది. CBDCలో ఒకటి సాధారణ లేదా రిటైల్‌ అవసరాలకు వినియోగించనుండగా… మరొకటి టోకు అవసరాలకు వినియోగిస్తారు. రిటైల్‌ CBDCని అందరూ ఉపయోగించుకోవచ్చు. టోకు CBDCని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News