E-Paper
Advertisement

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడి అరెస్ట్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడి అరెస్ట్
Advertisement

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మరో కీలక వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఢిల్లీలో ఈడీ అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్‌లో రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో రాఘవరెడ్డిని హాజరుపర్చనున్నారు.

ఇక ఈ కేసుకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకోగా… పంజాబ్‌కు చెందిన మద్యం వ్యాపారి, ఒయాసిస్ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ మల్హోత్రాను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

బుధవారం రోజున సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఎదుట గోరంట్ల బుచ్చిబాబును హాజరుపర్చారు. కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. అయితే కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే గౌతమ్ మల్హోత్రాను కూడా అదే రోజు కోర్టులో హాజరుపర్చి కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా.. ఏడు రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మాగుంట రాఘవను కూడా కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×