Monthly Periods : కాలం ఎంతమారిపోతున్నా..ఎన్ని మార్పులు వస్తున్నా శరీర ధర్మాలు మారవు. ముఖ్యంగా మహిళలు నెలసరికి సంబంధించిన విషయాలు మారవు. కాని నియమాలు పాటించాలంటే ఇవాళ్టి రోజుల్లో కష్టమే. కానీ మారిన పరిస్థితులుకు తగ్గట్టు నియమాలు పాటించాలి. గతంలో పెద్ద ఇళ్లు ఉండేవి కాబట్టి విడిగా ఉండటానికి ఆస్కారం. ఉండేది. పైగా అప్పట్లో మహిళలు బయటకి ఉద్యోగాల కోసం వెళ్లే వాళ్లు కాదు. చదువు కోసం కూడా బయటకెళాల్సి పని కూడా ఉండేది కాదు. మరి ఇప్పుడు నెలకు మూడు రోజులు కాలేజీలకు వెళ్లను, ఉద్యోగం చేయను అంటే కుదిరే పరిస్థితి ఉండదు.
ఆధ్యాత్మిక పనిచేసే వారికి మాత్రం వెసులుబాటు ఉండచ్చేమో కానీ మిగిలిన చోట్ల అది సాధ్యం కాదు. కాబట్టి దీనికి అనుగుణంగా నెలసరి నిమయాల్లో మార్పులు చేసుకోక తప్పదు. ఆ సమయంలో స్త్రీకి శారీరకంగా,మానసికంగా చాలా సున్నితత్వం ఉంటుంది. శరీరంలోని రక్తం బయటకపోవడం వల్ల తొందరగా చిరాకు, కోపం వంటివి వస్తుంటాయి. శరీరంలో కూడా ఓపిక ఉండని పరిస్థితి ఉంటుంది. బాగా రక్తం పోవడం వల్ల మెదడుకు అందాల్సిన అంత రక్తం అందక పనిమీద దృష్టిపెట్ట లేని పరిస్థితి. అందువల్ల ఆ సమయం తెలిసే పరిస్థితి ముందే తెలుస్తుంది కాబట్టి పని ఒత్తిడి తగ్గించుకోవాలి. బరువైన పనులు తగ్గించుకుని తేలికైన పనులు మాత్రమే చేయాలి. ఈవిషయంలో కుటుంట సభ్యుల సహకారం చాలా అవసరం.
నెలసరి సమయంలో 4వ రోజు స్నానం చేసేటప్పుడు ఆచారాలకి సంబంధించిన ఒక కథ చెప్పి ఏమేమి చేయకూడదో చెబుతారు. కాబట్టి అలాంటి పనుల జోలి వెళ్లకుండా చూసుకోవడం మరిచిపోవద్దు.
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఆ సమయంలో శరీరంలో వేలాది టాక్సిన్సులు వాయువు రూపంలో వెలువడుతుంటాయి. అవి థైమస్ గ్లాండ్ మీద ప్రభావం చూపిస్తుంటాయి అది గుండె దగ్గర ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నెలసరి సమయంలో మహిళలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. ఇది కేవలం ఆరోగ్యం దృష్టానే పాటించాలి. మడి, ఆచారం , పద్ధతి కాదు. కాబట్టి ఆస్థితిలో మహిళలకు దూరంగా ఉండటం వల్ల ఇతరుల ఆరోగ్యానికి కూడా మంచిది. ఈవిషయంలోఎంత వీలైతే పాటించడం మంచిది.