Jemimah Rodrigues Trolls: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ రెండవ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుపై అద్భుత విజయాన్ని సాధించిన టీమిండియా బ్యాటర్ జమీమా రోడ్రిగ్స్ ఆడిన చారిత్రక ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంటే.. మరి కొంతమంది మాత్రం ఆ సెమీఫైనల్ అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 8 సంవత్సరాల తరువాత భారత జట్టును సెమీఫైనల్ లో గెలిపించి ఫైనల్ వరకు తీసుకువెళ్లింది జమీమా. 134 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో అజేయంగా 127 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ ఆడింది. ఆమె పోరాటం కారణంగానే భారత జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రపంచకప్ ఫైనల్ కి చేరి.. ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించి కప్ సాధించింది.
Also Read: Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే
సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం చేసిన వ్యాఖ్యలతో జమీమా ప్రస్తుతం ట్రోల్స్ కి గురవుతుంది. ఆ జీసస్ నా వెంట ఉండి నడిపించాడని జెమీమా కామెంట్స్ చేయడంతో.. పలువురు రాజకీయ నాయకుడు, పలు హిందూ సంఘాలు, నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై వస్తున్న ట్రోల్స్ ని తిప్పికొట్టింది మాజీ క్రికెటర్ శిఖా పాండే. జమీమాని ఎగతాళి చేస్తున్న ట్రోల్స్ పై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేసింది. “ఎవరైనా ఈ విషయం వినాలి అనిపిస్తే చెబుతున్నా. అవును జమీమా దేవుడి ప్రియమైన బిడ్డ. మీరు అసూయపడితే క్షమించండి. దీనికి ఎవరు ఏం చేయలేరు”. అని ట్వీట్ చేసింది. ఇక జమీమాకు పలువురు మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు సైతం అండగా నిలుస్తున్నారు.
జమీమాపై వస్తున్న ట్రోల్స్ ని ఘాటుగా తిప్పి కొట్టిన శిఖా పాండే మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉమెన్ క్రికెటర్ అంటే ఎక్కువగా అందరికీ మిథాలీ రాజ్ గుర్తొస్తుంది. కానీ ఆమె బాటలో పయనించిన మరో ప్లేయర్ శిఖా పాండే. ఆల్ రౌండర్ గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కీలక హోదాలో పనిచేసింది. కానీ క్రికెట్ పై ఉన్న ఇష్టంతో మంచి ఉద్యోగాన్ని వదిలేసి తన కలను సహకారం చేసుకుంది.
Also Read: Ind vs Sa: కాపు – చౌదరి మధ్య చిచ్చు పెట్టిన దక్షిణాఫ్రికా లేడీ బౌలర్!
ఈమె 1989 మే 12న కరీంనగర్ లోని రామగుండంలో జన్మించింది. 15 ఏళ్ల వయసులోనే జాతీయస్థాయిలో గోవా రాష్ట్రానికి ప్రతినిత్యం వహించిన మొదటి క్రికెటర్ గా గుర్తింపు పొందింది. ఓ పక్క చదువుతూనే మరోపక్క క్రికెట్ ప్రాక్టీస్ కొనసాగించింది. గ్రాడ్యుయేషన్ తరువాత ఎన్నో కంపెనీలలో మంచి జీతంతో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. కానీ క్రికెట్ పై ఉన్న ప్రేమతో వాటిని తిరస్కరించింది. 2014లో భారత మహిళల క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంది. ఇక 2020లో జరిగిన ఐసీసీ మహిళల టి-20 ప్రపంచ కప్ లోని జట్టులో భాగమైంది.
Just putting this out for anyone who needs to hear the obvious – Yes, Jemi is God’s favourite child and if you are envious..umm..sorry, no one can help you!
— Shikha Pandey (@shikhashauny) November 3, 2025