Cargo Plane: అమెరికాలోని లూయిస్ విల్లే ఎయిర్ పోర్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిని కొద్ది నిమిషాలకే యూపీఎస్ కార్గో విమానం కుప్పకూలింది. యూపీఎస్ కు సరుకు రవాణా చేస్తున్నా ఎండి 11 విమానంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం కూలిన వెంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించి.. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.