Sree vishnu: శ్రీ విష్ణు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా హిట్ , ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే ఇటీవల వరుస సినిమాల పనులలో శ్రీ విష్ణు(Sree Vishnu) ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఈయన హీరోగా పలు సినిమాలు షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇందులో గీత ఆర్ట్స్ బ్యానర్ లో కార్తీక్ దర్శకత్వంలో దర్శకత్వంలో” సింగిల్” అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు మరో థ్రిల్లర్ సినిమా షూటింగ్ పనులలో కూడా ఈయన ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరో సినిమాకి కూడా ఈయన కమిట్ అయ్యారని తెలుస్తోంది.
విష్ణు హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరొక సినిమా చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తి కరమైన విషయాలను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధికారికంగా వెల్లడించారు. శ్రీ విష్ణు హీరోగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి కామెడీ ఎమోషన్స్ తో ఈ సినిమా ఉండబోతుందని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం అవుతాయని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీ విష్ణు ప్రస్తుతం ఇదివరకు కమిట్ అయిన సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కాగానే సన్నీ సంజయ్ (Sunny Sanjay)దర్శకత్వంలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు “ఐటమ్”(Item) అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారంటూ గతంలో కూడా వార్తలు బయటకు వచ్చాయి. త్వరలోనే ఈ వివరాలన్నీ కూడా అధికారకంగా వెల్లడి కానున్నాయి.
నిరాశ పరిచిన మాస్ జాతర?
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ సినిమా 39వ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ వంశీ(Nagavamshi) నిర్మాణంలో ఇదివరకు మాస్ జాతర(Mass Jathara) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లు ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అంచనాలకు అనుగుణంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల నాగ వంశీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలన్నీ కూడా కాస్త ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి. కింగ్డమ్(Kingdom) సినిమా తర్వాత ఈయన మాస్ జాతర సినిమాతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాయి.
Also Read: Big tv Kissik Talks: డ్యాన్సర్లు అంటే అంత చులకనా… ఎమోషనల్ అయిన రాజు!
The story of every YOUNGSTER 🤘
A new-gen entertainer packed with laughs, vibes & emotions that stay with you ❤️🔥#SitharaEntertainments Production No.39 x @SreeVishnuOffl 🔥
Directed by @ASunnySanjay
Produced by @vamsi84 & #SaiSoujanyaShoot begins soon 🎬@SitharaEnts… pic.twitter.com/la5NV2YIK9
— Sithara Entertainments (@SitharaEnts) November 5, 2025