Amazon Bumper offer: అమెజాన్ ప్రస్తుతం తెచ్చిన ఆఫర్లు చూసి ఆన్‌లైన్ షాపింగ్ ప్రేమికులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సీజన్‌లో ప్రతి విభాగంలోనూ భారీ తగ్గింపులు కనిపిస్తున్నాయి. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ నుండి బ్యూటీ ప్రోడక్ట్స్, ఫ్యాషన్ ఐటమ్స్ వరకు అన్నీ అద్భుతమైన ధరల్లో అందుబాటులోకి వచ్చాయి.
ఎక్కువ బడ్జెట్ తక్కువ ధరకు
ముఖ్యంగా గాడ్‌జెట్ల విభాగంలో ఉన్న బోట్, నాయిస్, వన్‌ప్లస్ వంటి టాప్ బ్రాండ్ల ఆడియో ప్రోడక్ట్స్ పై తగ్గింపులు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఆఫర్లలో ప్రత్యేకంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నవి బోట్ హెడ్‌ఫోన్లు, ఎయిర్‌డోప్స్ సిరీస్. సాధారణంగా నాలుగు నుంచి రూ.5వేల ధరలో ఉండే ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు 1000 రూపాయల లోపే దొరుకుతున్నాయి. అందుకే చాలా మంది యూజర్లు వెంటనే కొనుగోలు చేస్తున్నారు.
బోట్ రాకర్జ్ 255 జెడ్ ప్లస్
మొదటగా బోట్ రొకెర్స్ 255 జెడ్ ప్లస్ గురించి చెప్పుకుంటే, ఈ హెడ్ఫోన్ 50 గంటల బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. ఈఎన్ఎక్స్ టెక్నాలజీ, స్పేషియల్ ఆడియో, లో లాటెన్సీ మోడ్ లాంటి ఫీచర్లతో శబ్దం చాలా స్పష్టంగా, మ్యూజిక్ క్లారిటీగా వినిపిస్తుంది. సాధారణంగా దీని ధర రూ.4,489 కాగా, ప్రస్తుతం ఇది కేవలం రూ.1,099కు లభిస్తోంది. ఇది ఒక లిమిటెడ్ టైమ్ డీల్, అంటే స్టాక్ ఉన్నంతవరకే ఈ ధర కొనసాగుతుంది.
బోట్ రాకర్జ్ 255 ప్రో ప్లస్
దీని తర్వాత బోట్ రాకర్జ్ 255 ప్రో ప్లస్ ఉంది. ఇది కూడా అదే ధరలో రూ.1,099. కానీ ఇందులో ఉన్న 60 గంటల బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జింగ్, ఐపిఎక్స్7 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. చార్జ్ ఒక్కసారి చేస్తే రెండు రోజులు సులభంగా వినవచ్చు.
Also Read: Oppo 5G: 210ఎంపి కెమెరాతో ఒప్పో గ్రాండ్ ఎంట్రీ.. 7700mAh బ్యాటరీతో మాస్టర్ బ్లాస్టర్ ఫోన్
బోట్ ఎయిర్‌డోప్స్ 311 ప్రో
ఇక బోట్ ఎయిర్‌డోప్స్ 311 ప్రో గురించి మాట్లాడితే, ఇది ప్రస్తుతం అమెజాన్‌లో రూ.899కే లభిస్తోంది. దీని అసలు ధర రూ.4,990 అయినా, ఇప్పుడు 82% తగ్గింపుతో అందిస్తోంది. 50 గంటల బ్యాటరీ, డ్యూయల్ మైక్, ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదీగాక ట్రాన్స్‌పరెంట్ లిడ్ డిజైన్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
బోట్ ఎయిర్‌డోప్స్ 141/8
మరోవైపు బోట్ ఎయిర్‌డోప్స్ 141/8 కూడా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతోంది. దీని ధర కూడా రూ.899. ఇది 42 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. లో లాటెన్సీ మోడ్ ఉండటం వల్ల గేమింగ్ లేదా వీడియో కాల్స్ సమయంలో ల్యాగ్ లేకుండా శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది.
ప్రోడక్ట్స్ వెయ్యి రూపాయల లోపే
ఈ సేల్‌లో అందిస్తున్న ధరలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. రూ.4,000 నుంచి రూ.5,000 మధ్యలో ఉండే ప్రోడక్ట్స్ ఇప్పుడు వెయ్యి రూపాయల లోపే లభించడం చాలా అరుదు. అంతేకాదు, డెలివరీ కూడా వేగంగా జరుగుతోంది. ప్రైమ్ మెంబర్స్ అయితే అదే రోజు సాయంత్రానికే ఉత్పత్తులు అందుకునే అవకాశం ఉంది.
ఆఫర్లు లిమిటెడ్ టైమ్ డీల్
ఈ ఆఫర్లు ఎప్పుడు ముగుస్తాయో అమెజాన్ స్పష్టంగా ప్రకటించలేదు. “లిమిటెడ్ టైమ్ డీల్”గా చూపిస్తున్నందున స్టాక్ ముగిసిన వెంటనే ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించకుండా వెంటనే ఆర్డర్ పెట్టేయడం మంచిది. ఈ ధరలో ఇంత మంచి సౌండ్ క్వాలిటీ, లుక్, ఫీచర్లు కలిగిన ప్రోడక్ట్స్ మళ్లీ దొరకడం కష్టమే. షాపింగ్ చేయాలనుకుంటే ఇప్పుడే సరైన సమయం.