Saliva Test : వైద్య రంగంలో పురోగతి సాధిస్తూ.. హార్ట్ ఫెయిల్యూర్ లాలాజలంలో సులభంగా గుర్తించగలిగే ఒక పరీక్షను తాజాగా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కొత్త ఆవిష్కరణ గుండె జబ్బుల నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అంతే కాకుండా సరైన సమయానికి ట్రీట్ మెంట్ అందించడంలో కూడా రోగులకు ఉపయోగపడుతుంది.
హార్ట్ ఫెయిల్యూర్: సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనాల ప్రకారం.. సుమారు 6.7 మిలియన్ల మంది అమెరికన్ వయోజనులు గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. 2023లో సంభవించిన మొత్తం మరణాలలో 14.6% ఈ పరిస్థితి కారణంగానే సంభవించాయి. అమెరికాతో పాటు UK , ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలలో కూడా ఈ గుండె వైఫల్యం రేటు ఇలాగే ఉంది.
గుండె సంబంధిత సమస్యలను పూర్తిగా తగ్గించలేనప్పటికీ.. లైఫ్ స్టైల్ , ఆహారంలో మార్పులు, సరైన మందులతో చేసుకోవడం వల్ల జీవిత నాణ్యతను కాపాడుకోవడానికి అంతే కాకుండా మరణాల రేటును తగ్గించడానికి వీలవుతుంది. అందుకే సమయానికి నిర్ధారణ చాలా కీలకం.
కొత్త టార్గెట్:
క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ లోని ARC సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సింథటిక్ బయాలజీ శాస్త్రవేత్తలు S100A7 అనే నిర్దిష్ట ప్రొటీన్ బయోమార్కర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ నూతన లాలాజల పరీక్షను అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష ద్వారా ముందుగానే గుండె సంబంధిత సమస్యలను తెలుసుకోవచ్చు.
S100A7 (హ్యూమన్ సోరియాసిన్) అనేది S100 ప్రొటీన్ కుటుంబంలో ఒక భాగం. ఇది గతంలో సోరియాసిస్ , కొన్ని రకాల క్యాన్సర్‌లతో సహా అనేక ఇతర రుగ్మతలలో కూడా గుర్తించబడింది. గ్రిఫిత్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ బృందం S100A7 సిస్టోలిక్ గుండె వైఫల్యానికి బయోమార్కర్ అని మొదట కనుగొన్నారు.
పనిచేసే విధానం: MRNA డిస్‌ప్లే టెక్నిక్:
ఆ పరిశోధన ఆధారంగా.. శాస్త్రవేత్తల బృందం mRNA డిస్‌ప్లే అనే అధునాతన ల్యాబ్ పద్ధతిని ఉపయోగించి.. లాలాజలంలో S100A7 ను సులభంగా పరీక్షించే మార్గాన్ని రూపొందించింది.
ఈ పద్ధతిలో.. నిర్దిష్ట లక్ష్యం (ఈ సందర్భంలో S100A7) తో గట్టిగా బంధించబడే ప్రోటీన్‌లను ఉపయోగిస్తారు.
S100A7 అనేది ఒక చిన్న కాల్షియం-బంధన ప్రొటీన్. గుండె వైఫల్యం ఉన్నవారి లాలాజలంలో దీని స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
పరిశోధకులు S100A7 ను విశ్వసనీయంగా గుర్తించడానికి.. కస్టమ్-బిల్ట్ సింథటిక్ ప్రోటీన్‌ను సృష్టించారు. ఇది ఒక నిర్దిష్ట తాళానికి సరిపోయే తాళం చెవి లాగా S100A7 కు నేరుగా అతుక్కుపోతుంది. ఈ బంధం శాస్త్రవేత్తలకు ఆ ప్రొటీన్ ఉనికిని తెలియజేస్తుంది.
“ఇది ఒక పవర్ టూల్‌పై అటాచ్‌మెంట్‌ను మార్చినట్లుగా ఉంటుంది. ప్రాథమిక వ్యవస్థ అలాగే ఉంటుంది. కానీ మీరు దానిని వివిధ ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి మార్పు చేయవచ్చు.
పాత పరీక్షల కంటే మెరుగైన ఫలితాలు:
ప్రస్తుతం.. గుండె వైఫల్యాన్ని సాధారణంగా క్లినికల్ పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ వంటి వాటి ద్వారా గుర్తిస్తారు. ఇవి ఆర్థికంగా.. భౌగోళికంగా పరిమితంగా ఉంటాయి. దీంతో గుండె వైఫల్యం తీవ్రమయ్యే వరకు తరచుగా గుర్తించబడకుండా పోతుంది.
గుండె వైఫల్యం ఉన్న 31 మంది రోగులలో నిర్వహించిన కొత్త లాలాజల పరీక్ష, 81% సమర్థవంతంగా వ్యాధిని గుర్తించింది. ఇది సాంప్రదాయ, మరింత సంక్లిష్టమైన వైద్య పరీక్షలకు దాదాపు సమానం.
అంతేకాకుండా.. గుండె జబ్బులు లేని వారిని గుర్తించడంలో ఇది ప్రస్తుత పరీక్షల కంటే చాలా మెరుగ్గా పనిచేసింది. అంతే కాకుండా ఇది అనవసరమైన చికిత్సలను నివారించడానికి సహాయ పడుతుంది.