Big Stories

Gold : బంగారానికి మంచి రోజులు

Gold : దేశంలో బంగారం కొనుగోళ్లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అవి ఏ రేంజ్ లో ఉన్నాయంటే… జులై-సెప్టెంబర్ క్వార్టర్లో బంగారం అమ్మకాలు మళ్లీ కొవిడ్ ముందుస్థాయికి చేరుకున్నాయని… వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. పండుగల సీజన్‌కు తోడు బంగారం ధర తగ్గడం, ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండటం, రుణంపై బంగారం కొనుగోలుకు అవకాశాలు పెరగడంతో… సౌతిండియాలో… అదికూడా నగరాలు, పట్టణాల్లో నగల కొనుగోలుకు జనం ఆసక్తి చూపిస్తున్నారట. వడ్డీ రేట్లు పెరుగుతుండటం, రూపాయి బలహీన పడుతుండటంతో… భవిష్యత్ లోనూ బంగారం కొనుగోళ్లు బాగానే సాగుతాయని వ్యాపారులు ఆశిస్తున్నారు.

- Advertisement -

ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లోనూ… బంగారం కొనుకోళ్లు బాగానే జరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. డిసెంబర్లో పెళ్లిళ్ల సీజన్ కూడా ఉన్నందున… బంగారానికి గిరాకీ ఏర్పడుతుందని… మొత్తమ్మీద 2022లో 750 నుంచి 800 టన్నుల బంగారం అమ్మకాలు సాగుతాయని అంచనా వేశారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ దాకా… దేశంలోకి 559 టన్నుల బంగారం అధికారికంగా దిగుమతి అయింది.

- Advertisement -

గత ఏడాది థర్డ్ క్వార్టర్ తో పోలిస్తే… ఈ ఏడాది 14 శాతం అధికంగా బంగారానికి గిరాకీ ఏర్పడింది. నిరుడు జులై-సెప్టెంబర్ మధ్య 168 టన్నుల పసిడి దేశవ్యాప్తంగా అమ్ముడుపోగా… ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య 191.7 టన్నుల పసిడి అమ్ముడుపోయింది. విలువ పరంగా చూస్తే రూ.71,330 కోట్ల నుంచి 19 శాతం ఎగసి… రూ.85,010 కోట్లకు చేరింది. ఆభరణాలకు గిరాకీ 125.1 టన్నుల నుంచి 17 శాతం పెరిగి 146.2 టన్నులుగా నమోదైంది. విలువ పరంగా ఇది రూ.53,330 కోట్ల నుంచి 22 శాతం ఎగసి రూ.64,860 కోట్లకు చేరింది. ఇక గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లకు గిరాకీ 42.9 టన్నుల నుంచి 6 శాతం ఎగసి 45.4 టన్నులుగా నమోదైంది. విలువ పరంగా ఇది రూ.18,300 కోట్ల నుంచి 10 శాతం ఎగసి రూ.20,150 కోట్లకు చేరింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News