BigTV English
Advertisement

T20 : గ్రూప్-2లో సెమీస్ బెర్త్ ఎవరికి? ఎర్త్ ఎవరికి?

T20 : గ్రూప్-2లో సెమీస్ బెర్త్ ఎవరికి? ఎర్త్ ఎవరికి?

T20 : T20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా ఉత్కంఠభరిత విజయం సాధించి గ్రూప్-2లో అగ్రస్థానానికి చేరినా… సెమీస్ బెర్త్ పై మాత్రం క్లారిటీ రాలేదు. ఎందుకంటే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లకు సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఇప్పటికైతే సేఫ్ జోన్ లోనే ఉన్న టీమిండియా… వచ్చే ఆదివారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ జింబాబ్వే చేతిలో ఓడితే… దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.


దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక రద్దుతో… 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రొటీస్‌ ఇంకా పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో గెలిచినా ఏడు పాయింట్లతో సౌతాఫ్రికా సెమీస్‌కు వెళ్తుంది. ఒకవేళ రెండింట్లోనూ ఓడితే… ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. ఇక టీమిండియా చేతిలో ఓడిపోయి గ్రూప్-2లో మూడో స్థానంలో ఉంది… బంగ్లాదేశ్‌. తన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై గెలిస్తే సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాలి. అదే పాక్‌ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలగనుంది.

ఇక భారత్, జింబాబ్వే చేతుల్లో అనూహ్యంగా ఓడిన పాకిస్థాన్… నెదర్లాండ్స్‌పై కష్టపడి గెలిచింది. చివరి రెండు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో ఆడనుంది. ఈ రెండింటిలో గెలిస్తేనే పాక్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే. ఇక జింబాబ్వే, నెదర్లాండ్స్‌ జట్లకు సెమీస్ అవకాశాలు పెద్దగా లేవు. కానీ… భారత్ పై జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలిస్తే… భారత్, పాక్ సెమీస్ సమీకరణలు మారిపోయే ఛాన్స్ ఉంది. మొత్తమ్మీద… సూపర్-12 చివరి లీగ్ మ్యాచ్… వచ్చే ఆదివారం, అది కూడా భారత్-జింబాబ్వే మధ్య కావడంతో… ఏయే జట్లు సెమీస్ చేరతాయోనని అప్పటిదాకా ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.


Related News

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Big Stories

×