BigTV English

Baba : బాబాలు-స్వాములు చెప్పేది నమ్మచ్చా…

Baba : బాబాలు-స్వాములు చెప్పేది నమ్మచ్చా…

Baba : జ్యోతిష్యం చెప్పే వారికి సిక్స్ సెన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి ముఖ కవళికలను, కంటిచూపులోని శక్తిని, మాట్లాడేపద్ధతినీ, ముక్కుతీరును, వస్త్రధారణను, పెదాలను, భుజాల తీరును, నిలుచునే తీరును, కూర్చునే పద్ధతిని బట్టి ముందుగానే ఒక అంచనాకు వస్తారు. నవ్వే విధానాన్ని పరిశీలిస్తారు. మెడ పొడుగును చూపులతో కొలుస్తారు. చేతలను గాని, చేతులను గానీ పరిశీలించరు. కొద్ది సమయం తీసుకుని ఆలోచించుకుని మన జీవితం గురించి టకటకా చెబుతారు. మనలోని లోపాలనూ మనలేని విశేషాలనూ పుస్తకం చదివినట్టుగా చదివేస్తారు. దీన్ని ఫేస్ రీడింగ్ అంటారు. తెలుగులో భావసాముద్రికం అంటారు.


అయితే చెప్పేవ్యక్తి మంచి వాక్ శక్తి కలవాడై ఉండాలి. వినేవారిని మంత్రముగ్దులను చేయాలి. కళ్లలోకి సూటిగాచూస్తూ సావదానంగా వింటూ సందర్భోచితంగా స్థిర ప్రజ్ఞతో చెప్పాలి. చెప్పేటప్పుడు ఎదుటవాని ముఖకవళికలను గమనిస్తుండాలి. అంకెలల్లో ఒక సంఖ్యను, ఇష్టమైన రంగును, ఇష్టమైన పువ్వులు, రుచులను తెలుసుకుంటారు. ఒక్కో సంఖ్యకు ఒక్కో తత్వం ఉంటుంది. రుచులల్లో ఒక్కో దానికి ఒక్కో ధర్మం ఉంది. వీటన్నింటిని కలబోసి విశ్లేషించి జీవిత నడవడికను చెబుతారు. ఇది కూడా నూటికి 80 పాళ్లు నిజమేనన్నట్టు అనిపిస్తుంది. బాబాలు-స్వాములు-గురువులు ఇలాగే చెబుతుంటారు.

ఇలా చెప్పటానికి మాయలు, మంత్రాలు అక్కర్లేదు. మనిషిని చదువగలిగితే సరిపోతుంది. ఎదుట మనిషిని అర్ధం చేసుకునే కొంత సామర్ధం, కొంట మాటకారితనం ఉంటే చాలు. మాటకారితమే కాదు వేషధారణం కూడా ముఖ్యమే. వేషానికి తగ్గ భాష ఉంటేనే నమ్మకం కలుగుతుంది . ఇవన్నీ తెలుసుకునే బాబాలు-స్వాములు మన బతుకు చిత్రాన్ని చెబుతుంటారు. అయినా గురువు అనిపించుకోవాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. భగవంతుడ్ని ముఖాముఖి దర్శించిన వాడే గురువు అనే పదానికి అర్హుడు. వేదాలను భట్టీపట్టినంత మాత్రాన, స్టేజీ లెక్కి ఉపాన్యాసాలిచ్చినంత మాత్రాన ఎవరూ గురువు కాలేరు. సవికల్ప, నిర్వికల్ప , సమాధి స్థితులను అందుకో గలిగిన వ్యక్తులు మాత్రమే నిజమైన గురువు
అవుతారు. అటువంటి సామర్థ్యం ఆషామాషీ కాదు. నేటి రోజుల్లో దొంగ గురువులు, బాబాలు ఎక్కువైపోయారు.


Tags

Related News

Eclipse: గ్రహణం రోజు ఏం చేయాలి ? ఏం చేయకూడదో తెలుసా ?

Peepal Tree: ఇంటి గోడపై రావి చెట్టు పెరగడం శుభమా ? అశుభమా ?

Tulsi Plant: వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఏ దిశలో నాటాలి ?

Ganesh Immersion: మీరు ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారా ? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

Cats Scarified: 4 ఆలయాలు.. 4 పిల్లులు బలి.. ఆ గ్రామానికి అరిష్టమా?

Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావాలంటే.. ?

Big Stories

×