E-Paper
Advertisement

House Shifting Tips  : ఇల్లు మారేటప్పుడు ఈ పని చేయడం మరిచిపోవద్దు…

House Shifting Tips  : ఇల్లు మారేటప్పుడు ఈ పని చేయడం మరిచిపోవద్దు…
Advertisement

House Shifting Tips  : అద్దై ఇల్లులైనా, సొంత ఇళ్లు ఉన్నా ఒక చోట నుంచి మరో చోట మారేటప్పుడు సామాన్లు తరలింపు చేసుకుంటాం. అయితే అలా ఇల్లు మారేటప్పుడు కొన్ని పద్దతులు ఉంటాయి. చాలామందికి తెలియదు. కొంతమంది తెలిసినా పట్టించుకోరు. ఏ వస్తువులు వదిలేయాలి..ఏ వస్తువులు ముందు తరలించాలన్న పద్దతులు ఉంటాయి. అద్దె ఇంటికి విషయానికి వస్తే ఇల్లు షిప్ట్ అయ్యేటప్పుడు సామాన్లన్నీ ప్యాక్ చేస్తాం. ఇంటి ఖాళీ చేసేటప్పుడు వదలిపెట్టాల్సిన వస్తువుల్లో మొదటి నూనె. ఉప్పు. ఈ రెండు వస్తువుల్ని ఇల్లు ఖాళీ చేసేటప్పుడు తీసుకెళ్లకూడదు. అప్పటి వరకు మనం ఏ ఇంట్లో ఉన్నామో ఆ గృహంలోనే వాటిని వదిలేయాలి. కొత్త ఇంటికి వెళ్లినప్పుడు ఈ రెండు వస్తువులు మళ్లీ కొనుక్కోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది.

ఉప్పు, నూనె, రెండు శని గ్రహ సంబంధమైనవి, చంద్రగ్రహ సంబంధమైనవన్న సంగతి గుర్తు పెట్టుకోండి. ఉప్పు అనేది చంద్రగ్రహానికి సంబంధిందించి. నూనె శనీశ్వరుడికి సంబంధించింది. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి రుణాన్ని, బాధ్యతను,ప్రేమను పంచుకుని ఉంటాం. అందుకే ఆ రుణాన్ని తెంచుకుని పోలేం. మనుషుల మధ్య సంబంధాలను పెంచి పోషించేవి కూడా ఈ రెండే. చంద్రుడికి సంబంధించి తల్లి ప్రేమ , బంధుత్వం,బాంధవ్యాలు, అనురాగం వీటిని కారకాలుగా చెబుతోంది ధర్మశాస్త్రం. ఇలాంటి వాటిని తెంచుకుని పోలేం. కాబట్టి పంచుకుని వెళ్లాలి. ఇల్లు మారేటప్పుడు పూర్తిగా ఉప్పు తీసుకెళ్లకుండా కొంచెం అక్కడే ఉంచి వెళ్లినట్టయితే ఆ ఇంటితో, ఆ ఇంటి యజమానితో రుణాను బంధం పూర్తిగా తెగిపోకుండా ఉంటుంది. మనుషుల మధ్య బంధాన్ని పెంచుకోవాలని శాస్త్రం చెబుతోంది.

Advertisement

కనెక్షన్స్ ను రిలేషన్స్ గా ఆలోచన చేస్తున్న ఈ జీవన విధానంలో వేలాదమందితో మనం మన జీవితాన్ని పెనవేసుకుని కలిసి మెలిసి జీవిస్తున్నాం. వందలాది ఒక గ్రూప్ లో ఉంటే వాళ్లందరితో సన్నహిత్వం ఏర్పడదు. పరిచయం మాత్రమే ఏర్పడుతుంది. ఈ పరిచయం అనుబంధంగా మారే క్రమంలో భోజనాల, ఉప్పు , నూనె పదార్దాలు ఇవన్నీ చోటు చేసుకుంటాయి. కాబట్టి అద్దే ఇళ్లు ఖాళీ చేసేవాళ్లు ఉప్పు, నూనె వదిలి వేయాలి. శాస్త్రబద్ధంగా జీవితాన్నిగడుపుతూ ఇతరుల మంచిని కోరదాం…

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×