E-Paper
Advertisement

Kamal Hasan : భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్‌.. పాల్గొనేది ఎప్పుడంటే..?

Kamal Hasan : భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్‌.. పాల్గొనేది ఎప్పుడంటే..?
Advertisement

Kamal Hasan : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఉత్సాహంగా సాగుతోంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు రాహుల్ వెంట నడుస్తున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాదయాత్రలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్రలో ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ పాల్గొననున్నారు. డిసెంబర్‌ 24న ఈ యాత్రలో రాహుల్‌ తో కలిసి నడుస్తారు. రాహుల్‌ గాంధీ ఆహ్వానం మేరకు వచ్చే వారంలో కమల్‌ హాసన్‌ ఈ యాత్రలో పాల్గొంటారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 24న దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశిస్తుంది. ఎనిమిది రోజుల విరామం తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాలో కొనసాగించనున్నారు. చివరగా జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ముందు వచ్చే నెలలో రాహుల్‌ పంజాబ్‌లో యాత్ర చేయనున్నారు.

Advertisement

సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైంది. తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర పూర్తైంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి కశ్మీర్‌ చేరుకోనుంది.

Tags

Related News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

Big Stories

Advertisement
×