Mass Jathara Release: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరికెక్కిన తాజా చిత్రం “మాస్ జాతర”(Mass Jathara). ఈ సినిమా ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ చిత్రబృందం అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సినిమా మాత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే మాస్ జాతర సినిమా రిలీజ్ గురించి అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా చిత్రబృందం మాస్ జాతర సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఎంతో విభిన్నంగా హైపర్ ఆది(Hyper Aadi), రవితేజ (Raviteja)మధ్య సరదా సంభాషణను కొనసాగిస్తూ ఈ విడుదల తేదీని ప్రకటించడంతో రవితేజ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైపర్ ఆది రవితేజను ప్రశ్నిస్తూ మాస్ జాతర ఎప్పుడు విడుదలవుతుందని చెప్పడంతో సంక్రాంతికి వస్తుందని చెబుతారు అయితే సంక్రాంతికి వాయిదా పడడంతో తిరిగి హైపర్ ఆది రవితేజను ప్రశ్నించడంతో సమ్మర్ లో విడుదలవుతుందని చెబుతారు. అప్పుడు కూడా వాయిదా పడటంతో ఈసారి వినాయక చవితికి పక్కాగా వస్తోంది అంటూ రవితేజ చెప్పారు. అయితే సెప్టెంబర్ 27వ తేదీ కూడా ఈ సినిమా వాయిదా పడడంతో మరోసారి హైపర్ ఆది రవితేజను ప్రశ్నిస్తూ.. సంక్రాంతి అయిపోయింది సమ్మర్ అయిపోయింది వినాయక చవితి అయిపోయింది మాస్ జాతర ఎప్పుడు? అంటూ ప్రశ్నించడంతో వెంటనే రవితేజ నిర్మాతకు ఫోన్ చేస్తాడు.
హలో చింటూ ఎక్కడున్నావ్.. మన భవిష్యత్తు ఏంటి? సంక్రాంతి, సమ్మర్, వినాయక చవితి కూడా అయిపోయింది మరేంటి చెప్పు అంటూ రవితేజ ప్రశ్నించడంతో సినిమా విడుదల తేదీ గురించి తెలియజేస్తూ ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్టోబర్ 31వ తేదీ మాస్ జాతర రాబోతుందని ఇది ఫిక్స్ అంటూ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఇలా అక్టోబర్ 31వ తేదీ ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Sankranthi Ayipoyindhi,
Summer Ayipoyindhi,
Vinayaka Chavithi Ayipoyindhi…#MassJathara Yepudu? 🤔Eesari matram release pakkaa!! 💥😎
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna @NavinNooli @Naveenc212… pic.twitter.com/8V86FiYAkX
— Sithara Entertainments (@SitharaEnts) October 1, 2025
ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ నిర్మించగా, భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో రవితేజకి జోడిగా శ్రీ లీల(Sreeleela) నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక గతంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక శ్రీ లీల రవితేజ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా పక్క బ్లాక్ బాస్టర్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి 31వ తేదీ మాస్ జాతర ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఎదురుచూడాల్సిందే.
Also Read: Actor Ajith: వింత వ్యాధితో బాధపడుతున్న అజిత్.. సరైన నిద్ర లేదంటూ?