BigTV English

Kavitha: లక్ష మందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా.. కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha: లక్ష మందితో బతుకమ్మ పండుగ చేసి చూపిస్తా.. కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha: పదివేలమందితో బతుకమ్మ పండుగను చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను అవమానించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. వచ్చే ఏడాది లక్షమంది మహిళలతో హైదరాబాద్ నగరంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని ఆమె చెప్పారు.


ఆడబిడ్డలకు చీరలు ఇచ్చిఉంటే బాగుండేది..

తెలంగాణ ప్రజలు చింతమడక నుంచి లండన్ వరకు ఆదరించారు. తెలంగాణ సోయిలేని ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంది. గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి గెజిట్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. ఆయన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విచిత్రంగా అనిపించింది. గిన్నిస్ బుక్ రికార్డుల కోసం బతుకమ్మ పండుగలు చేశారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు ఇచ్చిఉంటే బాగుండేది. వచ్చే ఏడాది లక్షమంది మహిళలతో హైదరాబాద్ నగరంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తాం’ అని కవిత తెలిపారు.


ఆడబిడ్డలను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రభుత్వం బ్రేక్ చేసినా దాన్ని తిరగరాసే విధంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తాం. పది వేల మందితో బతుకమ్మ పండుగను చేసి ప్రభుత్వం ఆడబిడ్డలను అవమానించింది. బీసీ బిల్లులకు రాజకీయ పరమైన రిజర్వేషన్లకు ఇబ్బంది వస్తుంది. విద్య,ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు రావు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి రేవంత్ రెడ్డి దగ్గరి మనుషులు కోర్టుల్లో కేసులు వేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిన బీజేపీ ఎన్నికలు జరిగితే కోర్టుల్లో క్యాన్సిల్ చేస్తామని అంటోంది’ అని అన్నారు.

ఎస్టీలు లేకపోయినా సర్పంచ్ పదవి రిజర్వ్..

ఈటెల రాజేందర్ ఎన్నికల్లో పోటీ చేయవద్దు అని అంటున్నారు. బీజేపీ ఏమైనా కోర్టునా…? ఈటెల రాజేందర్ బీసీ బిడ్డ, ఉద్యమకారుడు, ఎంపీ ఎట్లా మాట్లాడతారు..? ఈటెల రాజేందర్ మాటలు వ్యక్తిగతమా బీజేపీ స్టాండా చెప్పాలి..? కోర్టులు చెప్పే మాటలు ఆయన ఎట్లా చెప్తున్నారు. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ గురించి బీజేపీ మాట్లాడాలి. ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్ళు పట్టుకుని బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తేవాలి. తండా గ్రామ పంచాయతీలో ఒక్క ఎస్సీ లేకపోయినా ఎస్సీకి రిజర్వ్ చేశారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్టీలు లేకపోయినా ఎస్టీలకు సర్పంచ్ పదవి రిజర్వ్ చేశారు’ అని కవిత మండిపడ్డారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రికార్డ్ బద్దలు కొడతాం..

గ్రామ పంచాయతీల వారీగా కులాల లిస్ట్ పెట్టి ఎవరు ఎక్కువ ఉంటే రిజర్వేషన్లు వారికి ఇవ్వాలని చెప్పాం. రెండు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో అమలు కాలేదు. ఎస్సి వర్గీకరణ బిల్లు పాస్ చేసి ఎందుకు..? బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ చేస్తారా లేదా బీజేపీ చెప్పాలి. ఈటెల రాజేందర్ బీసీలకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ తెలంగాణ బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఈటలపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. ప్రభుత్వం చేసిన బతుకమ్మ రికార్డును వచ్చే సంవత్సరం జాగృతి ఆధ్వర్యంలో బద్దలుకొడదాం’ అని అన్నారు.

ALSO READ: Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ పార్టీ కుట్ర

బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంది. డేటా బయటపెట్టి ఉంటే మేము ఆరోపణలు చేసేవాళ్ళం కాదు. అక్టోబర్ 8వ తేదీన కోర్టు తీర్పును బట్టి జాగృతి కార్యాచరణ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. నిజామాబాద్ ఎంపీ అరవింద్ నాకు సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై ఇంకా జాగృతి నిర్ణయం తీసుకోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించనిది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో ప్రజల జీవితాల్లో మార్పులు రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. రైతులకు యూరియా సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది’ అని కవిత పేర్కొన్నారు.

ALSO READ: AP RDMHS: ఏపీలో టెన్త్ క్లాస్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 వేతనం, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

Related News

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, బయటకు వెళ్తే అంతే సంగతులు..!

Telangana Politics: అనిరుధ్ రెడ్డి vs కేటీఆర్, ప్రతీది రాజకీయమే.. స్వేచ్ఛ మీ దగ్గరెక్కడ?

Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన

Minister Uttam: తెలంగాణలో ఈసారి రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి.. దేశంలో మరోసారి అత్యధికంగా..?

Weather News: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్, ఈ టైంలో బయటకు వెళ్లొద్దు

Free Bus Ticket: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వలేదని.. బస్సు కింద పడుకుని మహిళ హల్ చల్

Rains Effect: ఓరుగల్లులో చినుకు పడితే చిత్తడే.. ఎన్నాళ్లీ వరద కష్టాలు..

Big Stories

×