BigTV English

Narne Nithin Wedding: పెళ్లి పీటలెక్కబోతున్న ఎన్టీఆర్ బామ్మర్ది… ముహూర్తం డేట్ ఎప్పుడంటే?

Narne Nithin Wedding: పెళ్లి పీటలెక్కబోతున్న ఎన్టీఆర్ బామ్మర్ది… ముహూర్తం డేట్ ఎప్పుడంటే?

Narne Nithin Wedding: టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్(Narne Nithin) గరించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మ్యాడ్ (Mad)అనే సినిమా ద్వారా హీరోగా ఈయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న నితిన్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. నార్నే నితిన్ స్వయాన ఎన్టీఆర్ (NTR)కు బావమరిది అనే సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranathi)కి తమ్ముడు కావటం విశేషం. ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ హీరో వ్యక్తిగత విషయానికి వస్తే త్వరలోనే ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.


అక్టోబర్ 10 న నితిన్, శివాని వివాహం..

ఇదివరకే నితిన్ శివాని (Shivani)అనే అమ్మాయితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరి నిశ్చితార్థపు వేడుక నవంబర్ 3 2024 న ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థపు (Engagment)వేడుకకు పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. ఇలా గత ఏడాది నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట అక్టోబర్ 10 వ తేదీ శివానితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది. అయితే వీరి వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక శివాని కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే ఈమె మరొక హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబానికి సమీప బంధువులని తెలుస్తోంది.

శివానితో నార్నే నితిన్ వివాహం…

శివాని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె. నెల్లూరులో వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయిన నార్నే శ్రీనివాస్ రావు కుటుంబంతో వెంకటప్రసాద్ వియ్యం అందుకోబోతున్నారు. ఇక నితిన్ శివానీలా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి వేడుకలో భాగంగా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి కుటుంబ సభ్యుల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.


ప్రమాదానికి గురి అయిన తారక్…

ఇక నితిన్ కెరియర్ విషయానికి వస్తే మ్యాడ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నితిన్ అనంతరం అయ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్వాలేదని అనిపించుకున్నప్పటికీ తదుపరి మాడ్ స్క్వేర్ తో మరో హిట్ అందుకున్నారు. ఇకపోతే నితిన్ పెళ్లి తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా మరికొద్ది రోజులపాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉండబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల ఈయనకు షూటింగ్లో ప్రమాదం జరిగిన నేపథ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే ఇంకా ఈ గాయం పూర్తిగా నయం కాలేదని తెలుస్తుంది. ఇక త్వరలోనే తన బావమరిది పెళ్లి కూడా జరగబోతున్న నేపథ్యంలో ఒకేసారి పెళ్లి పనులను పూర్తి చేసుకుని సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నట్టు సమాచారం.

Also Read: Mass Jathara Release :చివరికి హీరో కూడా చింటూ అనేశాడు… ఫైనల్ గా మాస్ జాతర రిలీజ్ డేట్ వచ్చేసింది

Related News

Akhanda 2 : పోటాపోటీగా చిరు, బాలయ్య సినిమా అప్డేట్స్, ఫైట్ కొనసాగుతుందా?

Balakrishna: బాలయ్య బ్రాండ్ కొత్త యాడ్ వీడియో… AI తో మ్యానేజ్ చేశారా ఏంటి?

MSVPG : మన శంకర వరప్రసాద్ గారు దసరా సర్ప్రైజ్ ఫస్ట్ లుక్..పోస్టర్ వైరల్!

Samantha: బన్నీ AA 22 లో సమంత స్పెషల్ రోల్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Mass Jathara Release :చివరికి హీరో కూడా చింటూ అనేశాడు… ఫైనల్ గా మాస్ జాతర రిలీజ్ డేట్ వచ్చేసింది

Allu Sirish engagement : రూమర్స్ నిజమే.. ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన అల్లు శిరీష్.. ఎప్పుడంటే?

Actor Ajith Kumar: వింత వ్యాధితో బాధపడుతున్న అజిత్.. సరైన నిద్ర లేదంటూ?

Big Stories

×