Bigg Boss Thanuja: బిగ్ బాస్ తెలుగు సీజన్ షో చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. హౌస్ లో ఎవరు ఎలాంటి వారు అని ఇప్పటికే చాలామందికి ఒక అవగాహన వచ్చింది. ఇంకా కొంతమంది కూడా తమ ఒరిజినాలిటీని బయటకు తీయకుండా నటిస్తున్నారు. కొన్ని హఠాత్ పరిణామాల వలన అందరు భావోద్వేగాలు బయటపడుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో చాలామంది మధ్యలో మంచి బాండింగ్ ఏర్పడింది. తనుజ భరణిను నాన్న అని పిలవడం, అలానే ఇమ్మానుయేల్ ను సంజన కొడుకు అని పిలవడం. మీరంతా కూడా వారి మధ్య ఒక పర్సనల్ అటాచ్మెంట్ పెట్టుకున్నారు. అదే ఎమోషన్ తో కూడా గేమ్లో ఆడుతున్నారు.
ఇకపోతే బిగ్ బాస్ ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఆ ప్రోమో చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ ప్రోమోలో హౌస్మెట్స్ అంతా కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. ఈ గేమ్ లో తనుజ ట్రూత్ ఎంచుకుంది. ట్రూత్ ఎంచుకున్న వెంటనే ఫస్ట్ లవ్ ఏంటో చెప్పాలి అని హౌస్ మేట్స్ అడిగారు.
తనుజ తన ఫస్ట్ లవ్ గురించి రివీల్ చేసింది. తన ఫస్ట్ లవ్ ఎనిమిదో తరగతిలో జరిగిందంట. అది కూడా వన్ సైడ్ లవ్ అని చెబుతుంది. ఈ ప్రోమో చూసిన చాలామంది, అంత చిన్న ఏజ్ లో లవ్ అంటే తనుజ ముదిరే అని చెప్పుకోవాలి. కానీ చూడడానికి మాత్రం చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది.
అలానే ఈ ప్రోమోలో ఇమ్మానియేల్ తో మాట్లాడిన కాన్వర్జేషన్ కూడా చూపించారు. మొదట్లో ప్రేమికులు ఎలా అయితే ఇంట్లో తెలియకుండా మాట్లాడుకుంటారు అచ్చం ఆ సీన్ ని రీ క్రియేట్ చేశారు. ఇమ్మానుయేల్ ఒక దానిలో ఇన్వాల్వ్ అయ్యాడు అంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాన్వర్జేషన్ కూడా ఎంటర్టైన్మెంట్ వే లోసాగింది.
Also Read: Allu Sirish engagement : రూమర్స్ నిజమే.. ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన అల్లు శిరీష్.. ఎప్పుడంటే?