యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశ వ్యాప్తంగా ప్రజా రవాణాను మరింత అద్భుతంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే అత్యాధునిక హైస్పీడ్ రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఏకంగా గంటకు 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే రైలును మరో ఏడాది కాలంలో ప్రజలకు పరిచయం చేయబోతోంది. అబుదాబిలో జరుగుతున్న గ్లోబల్ రైల్ కాన్ఫరెన్స్ లో ఎతిహాద్ సంస్థ తమ హైస్పీడ్ రైలును ప్రదర్శించింది. ఈ రైలు 2026లో కమర్షియల్ ఆపరేషన్స్ మొదలుపెట్టనుంది. గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణించనుంది. ఈ రైలు 11 ప్రధాన నగరాలను కలుపుతూ వెళ్లనుంది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. కేవలం 57 నిమిషాల్లో అబుదాబి నుంచి దుబాయ్ వరకు ప్రయాణించవచ్చు. ఈ ప్రాజెక్ట్ రాబోయే 50 సంవత్సరాలలో యుఎఇ జిడిపికి కారణం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ హైస్పీడ్ ప్యాసింజర్ రైళ్లు మూడు రాకాల క్లాస్ లను అందిస్తాయి. ఎకానమీ, ఫ్యామిలీ, ఫస్ట్ క్లాస్. ఎకానమీ క్యాబిన్ లో సౌకర్యవంతమైన కాంపాక్ట్, ముదురు బూడిద రంగు బ్యాక్ టు బ్యాక్ సీటింగ్ ఉన్నాయి. ఇది ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లివచ్చే రోజువారీ ప్రయాణికులకు అనుగుణంగా ఉంటుంది. ఫ్యామిలీ క్యాబిన్ లో ఆహ్లాదకరమైన, విశాలమైన టేబుల్ తో ఎదురెదురు సీటింగ్ ఉంటుంది. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ప్రయాణీకులకు అదనపు సౌకర్యం, ప్రీమియం అనుభవం కోసం విశాలమైన, సర్దుబాటు చేయగల సీటింగ్ ఆప్షన్స్ ను అందిస్తుంది. అన్ని క్యాబిన్లలో ఫోల్డబుల్ ట్రే టేబుళ్లు, ఓవర్ హెడ్ స్టోరేజ్ కంపార్ట్ మెంట్లు, లగేజీ కోసం విశాలమైన స్టోరేజ్ కంపార్ట్ మెంట్లు ఉంటాయి. ప్రయాణీకులు ఆటోమేటెడ్ టికెట్ గేట్ల ద్వారా ఈ స్టేషన్లను యాక్సెస్ చేస్తారు. ఆన్ లైన్ లో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్టేషన్లలో టికెట్ వెండింగ్ మెషీన్లు కూడా అందుబాటులో ఉంటాయి. టికెట్ మెషీన్ నలుపు, బూడిద రంగులో ఉండే ప్రోటోటైప్ ను కలిగి ఉంటుంది. క్యాష్ తో పాటు కార్డులు, ఆపిల్ పేను యాక్సెప్ట్ చేస్తాయి.
Read Also: డ్రోన్ సాయంతో రైలు మొత్తాన్ని కడిగేశారు.. జస్ట్ అరగంటలోనే!
ఇక ఈ రైలు వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఎతిహాద్ సంస్థ ప్రయత్నిస్తోంది. టెస్టింగ్ తర్వాత ఈ రైలుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఈ రైలు ప్రారంభం అయిన తర్వాత అబుదాబి-దుబాయ్ మధ్య ప్రయాణ సమయం కేవలం 57 నిమిషాలకు తగ్గనుంది. ఈ రైళ్లు గంటకు 200 కి.మీ వరకు ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. నెట్ వర్క్ లో రెండు రకాల రైళ్లు నడుస్తాయి. ఒకదాంట్లో 365 సీట్లతో కూడిన చైనీస్ CRC క్యాబిన్‌లు ఉంటాయి. మరొకటి 369 సీట్లతో స్పానిష్ CAF క్యాబిన్‌లను కలిగి ఉంటుంది.
Read Also: పండుగకు 1,450 ప్రత్యేక రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్!