E-Paper
Advertisement

Hyderabad Real Estate : ఇల్లు కొనడమే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటున్న హైదరాబాదీస్

Hyderabad Real Estate : ఇల్లు కొనడమే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటున్న హైదరాబాదీస్
Advertisement
Hyderabad Real Estate

Hyderabad Real Estate : ఇల్లు కొనడం మంచిదా.. స్థలం కొనడం మంచిదా అనే సందిగ్ధం చాలా మందిలో ఉంటుంది. ఇల్లు కొనడమే మంచిదని కొందరు.. కాదు స్థలమే బెటర్ అని మరికొందరు చెబుతుంటారు. హైదరాబాదీస్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇళ్లు కొనడమే బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. లాస్ట్ మార్చి నెలలో ఏకంగా రూ.3,352 కోట్ల విలువైన ఇళ్లు కొన్నారు. అంటే, హైదరాబాద్, చుట్టుపక్కల ఒక్క నెలలోనే 6,414 అపార్ట్‌మెంట్లు బుక్ చేసుకున్నారు. ఫిబ్రవరి కంటే ఎక్కువగా మార్చి నెలలో ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయి.

ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్‌లో ఇళ్లు కొనడమే బెటర్. ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. పైగా మిగిలిన నగరాల కంటే హైదరాబాద్‌లో రేట్లే చాలా తక్కువ. ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కాకుండా మరెక్కడ కొంటారు చెప్పండి. పైగా స్థలం మీద పెట్టుబడి కంటే ఇల్లు కొంటే.. కనీసం అద్దె అయినా వస్తుంది. కొంతలో కొంత ఆదాయం తిరిగి వస్తున్నట్టే లెక్క.

Advertisement

హైదరాబాద్‌ సిటీలో మాత్రమే ఇళ్లు కొనడం లేదు. చుట్టుపక్కల ప్రాంతాలూ బాగా డెవలప్ అవుతున్నాయి. అందుకే, హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, మల్కజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు కొంటున్నారు. పైగా ఇప్పటికీ ఈ ప్రాంతాల్లో 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇళ్లు దొరుకుతున్నాయి. మార్చి నెలలో అమ్ముడైన ఇళ్లలో 53 పర్సెంట్ 50 లక్షల లోపు ధర ఉన్నవే. 50 లక్షల కంటే ఎక్కువున్న ఇళ్లు 29 శాతం అమ్ముడుపోయాయి. డిమాండ్ బాగుండడంతో రేట్లు కూడా పెంచేశారు బిల్డర్లు. అయినా సరే.. మున్ముందు మంచి ధర వస్తుందన్న నమ్మకంతో ఇళ్లు కొనేస్తున్నారు హైదరాబాదీస్. ముఖ్యంగా లార్జర్ టికెట్ సైజ్ ఇళ్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అంటే కోటి రూపాయలు, ఆపైన విలువ గల ఇళ్లకు డిమాండ్‌ బాగా ఉంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×