Kumkuma : పసుపు, కుంకమ, గాజులు, మంగళసూత్రం , పువ్వులు, మెట్టెలు స్త్రీల ఐదోతనానికి సంబంధించినవి. ఐదోతనం అంటే ఆనందంగా కనిపించేంది. వీటిని కింద పడినా కానీ, నేల జారినా, చేయి జారినా మనసు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళల మనస్సు చాలా సున్నితమైంది. వారికి ఏం చెబితే అది వెంటనే మనస్సులోకి తీసుకుంటారు. దీని వల్ల ఆమె చేసే అన్ని పనులపైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి మంగళకరమైన వస్తువులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పూర్వం నుంచి మన పెద్దలు చెబుతుంటారు. అలా గట్టిగా మనసులో నాటుకుపోవడానికి కొన్ని రకాలు భయాలు కలిగించేలా నియమాలు పెట్టారు.
మహిళలు సౌభాగ్యానికి ప్రతీక అయిన కుంకుమ కింద పడటం మంచిదేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కుంకుమ కింద పడటం అశుభం అని చెప్పడం అపోహ మాత్రమేనని సెలవిస్తున్నారు..నిజానికి కుంకుమ గానీ కుంకుమ భరిణ కింద పడటం కానీ శుభ సూచకం. భూమాత తనకూ బొట్టుపెట్టమని చేసే సంకేతం అది. ఏదైనా పూజ గానీ వ్రతం గానీ చేసినప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం.
ఇంటికి వచ్చిన అతిథులను సాగనంపే టప్పుడు కూడా పసుపు, కుంకుమ, పువ్వులు ఇవ్వడం ఆనవాయితీ. ఆడవారు తమ సౌభాగ్యానికి చిహ్నంగా భర్త ఆయుష్షు కోసం వివాహిత స్త్రీలు తమ నుదుట కుంకుమ ధరిస్తారు.పసుపు, కుంకుమ ఏదైనా కార్యాలు చేసేటప్పుడు కింద పడితే మీరు భూమాతను మరిచిపోయారు అని ఇక అదే సమయంలోనే భూమాతకు బొట్టు పెట్టి.. మిగతా కుంకుమను చెట్లల్లో వేస్తే సరిపోతుంది.
ఏదైనా పూజ కానీ, వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కింద పడితే తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి. అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించడం, బాధ పడడం సరి కాదు.