Main Entrance : గడప అంటే లక్ష్మీదేవి. అందుకే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో గుమ్మాన్నిఅలుకుతారు. మంగళకరమైన కుంకమ బొట్టు పెడుతుంటారు. అసుర సంధ్య వేళ శ్రీమహావిష్ణువు నరసింహావతారం ఎ్తి ఉగ్రుడై హిరణ్య కశిపుడిని సంహరించాడు అలాంటి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. కాబట్టిగడపకు వారానికి ఒకసారైనా పసుపు రాసి కుంకమ బొట్టు పెట్టడం మంచిది. ఒకవేళ వీలు కాకపోతే పండుగ రోజుల్లో అయినా పసుపు రాయాలి. ఈవిధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుంది. ఎటువంటి దుష్టశక్తులు రావు.
పూర్వం రోజుల్లో పాములెక్కువ తిరుగుతుండేవి. రక్షణగా కూడా పసుపును గుమ్మాలకూ, గడపకూ పట్టించే వారు. పసుపు ఘాటుకు పాములాంటి విష క్రిములు లోపలికి రాలేవు. గుమ్మానికి పసుపు రాసి కుంకమ బొట్లు పెట్టడం ద్వారా గురు,శుక్రులు మనకు అనుకూలంగా ఉంటారు.
పసుపు రాసే సంప్రదాయం పాటించే ఆడపిల్లలకు ఆలస్యం కాకుండా పెళ్లిళ్లు జరుగుతాయి. మంచి వరుడు వస్తాడు. అలాంటి గృహిణిని భర్త ఎన్నడూ కష్టపెట్టడు. పెళ్లైన మహిళలను గడపను గౌరీస్వరూపంగా భావిస్తుంటారు. అలాంటి గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మాన్ని తొక్కకూడదు. వాటికి చీపురు లాంటివి అంటించరాదు. ఇలా మన ఇంట్లో ఉన్న గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ పూజ చేస్తే ఇంట్లో దరిద్రం ఉండదు.