E-Paper
Advertisement

Japan : తమ రాకెట్‌ను తామే ధ్వంసం చేసిన జపాన్.

Japan : తమ రాకెట్‌ను తామే ధ్వంసం చేసిన జపాన్.
Advertisement
Japan

Japan : స్పేస్ పరిశోధనలు చేయడం అంత సులభం కాదు. అందులోనూ ఒక శాటిలైట్‌ను ఆకాశంలోకి పంపించాలంటే ఆస్ట్రానాట్స్ ఎన్నో ఏళ్లు కష్టపడతారు. ఆ పరిశోధనల విషయంలో అంచనా కొంచెం తప్పినా కూడా అది పూర్తి దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంటుంది. జపాన్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక రాకెట్‌ను లాంచ్ చేయాలనుకుంది. కానీ చివరి నిమిషంలో అంతా మారిపోయింది.

తాజాగా జపాన్ స్పేస్ ఏజెన్సీ ఒక కొత్త హెచ్3 రాకెట్ లాంచ్‌కు సిద్ధమయ్యింది. కానీ లాంచ్‌కు కొద్ది క్షణాల ముందే తమ లాంచ్‌ను తామే ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు దశాబ్దాలుగా జపాన్ నుండి ఒక్క రాకెట్ లాంచ్ కూడా జరగలేదు. ఇన్నాళ్లకు లాంచ్ చేయాలనుకున్న ఈ రాకెట్ ఇగ్నిషన్ చివరి క్షణంలో ఫెయిల్ అవ్వడంతో జపాన్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

Advertisement

జపాన్ లాంచ్ చేయాలనుకున్న ఈ రాకెట్‌లో అడ్వాన్స్‌డ్ ల్యాండ్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఆలోస్ 3) పొందుపరిచి ఉంది. ఇది అంతరిక్షం నుండి భూమిని గమనించడానికి, భూమిపైన జరిగే ప్రకృతి వైపరీత్యాలను ముందే గమనించడానికి ఉపయోగపడందని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు. అంతే కాకుండా ఈ లాంచ్‌లో డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఒక భాగమయ్యింది. మిలిటరీ యాక్టివిటీని గమనిస్తూ ఉండడానికి, మిస్సైల్ లాంచ్ అప్డేట్స్ కోసం ఈ రాకెట్‌లోని ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్‌ను ఉపయోగించాలని డిఫెన్స్ మినిస్ట్రీ అనుకుంది.

ఒకవేళ రాకెట్ లాంచ్ సక్సెస్ అవ్వకపోతే.. ఆలోస్‌ను మరో శాటిలైట్ ద్వారా పంపించాలన్న ముందుజాగ్రత్త కూడా జపాన్ ఆస్ట్రానాట్స్ తీసుకోలేదు. అంతే కాకుండా ఈ రాకెట్‌ను ధ్వంసం చేయకపోతే జరిగే నష్టం గురించి కూడా వారు ఏమీ మాట్లాడలేదు. హెచ్3 రాకెట్ లాంచ్ ఫెయిల్ అవ్వడం ఇది రెండోసారి. ఇప్పటికే ఒక గ్లిచ్ కారణంగా రాకెట్ లాంచ్ ఆగిపోయింది. ఈసారి మరో టెక్నికల్ సమస్య వల్ల రాకెట్‌ను ఏకంగా పేల్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జపాన్‌కు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×