Big Stories

Marriage Sentiments :- అమ్మాయి పుట్టింటి నుంచి ఈ వస్తువులు తీసుకురాకూడదా…?

- Advertisement -

Marriage Sentiments :- అమ్మాయిని అల్లుడి చేతిలో పెట్టి బాధ్యత పూర్తి చేసుకున్న తల్లిదండ్రులు ఆమె బాగోగులు చూస్తూనే ఉంటారు. కూతురికి ఏం కావాలంటే అవి ఇవ్వడానికి సిద్దంగా ఉంటారు. తాహతుకి తగ్గట్టు డబ్బులు, వస్తువులు , నగలు రూపంలో కూడా ఇస్తుంటారు. బట్టలు , సామాన్లు వంటివి సరే సరి. అయితే అమ్మాయి పుట్టింటికి వచ్చినప్పుడు కొన్ని వస్తువులు తీసుకెళ్లకూడదంటారు పెద్దలు. తన అత్తింట్లో లేని వస్తువు ఏదైనా కనిపిస్తే పుట్టింటి నుంచి కూతుళ్లు తీసుకెళ్లడం సహజం. అలా తీసుకెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లాలో..ఏం తీసుకెళ్లకూడదా కూడా తెలుసుకోవడం మంచిది.

- Advertisement -

ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తుంటారు. అలాంటి ఉప్పును కూడా కూతుర్ని పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లకూడదంటారు. పుట్టింటి నుంచి తీసుకెళ్లని వస్తువుల్లో చింతకాయలు, కుంకుడు కాయలు, కొబ్బరికాయలు, వంటకి ఉపయోగించే నూనె ఉన్నాయి.ఒక వేళ వాటిని తీసుకెళ్లాల్సి వస్తే ఎంతో కొంత డబ్బు చెల్లించి మాత్రమే అమ్మాయి అత్తగారింటికి తీసుకెళ్లవచ్చని పెద్దలు చెబుతున్నారు. అశుభంలాంటివి జరిగిప్పుడు మాత్రమే కుంకుడు కాయలు, షీకాయలు లాంటి తీసుకెళ్తారు. అలాగే ఐరన్ వస్తువులు అంటే కత్తెర, కత్తుల్ని కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్లకూడని వస్తువుల జాబితాలో ఉన్నాయి. అలాగే కూరగాయాల్లో మెంతులు, కాకర కాయలు వంటి చేదు గుణాలున్న వాటిని తీసుకెళ్లరాదు.

పుట్టింటి నుంచి ఏవస్తువు తీసుకెళ్లినా కూతురు వాటిపై మమకారం చూపిస్తుంది. ఇది మా పుట్టింటి నుంచి తెచ్చామని అత్తగారితోపాటు భర్తకి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటుంది. పుట్టింటి నుంచి వాడిన వస్తువులు తీసుకెళ్లే ముందు ఓ సారి ఆలోచించండి. ముఖ్యంగా పూజ సామాగ్రికి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే ఒకసారి అక్కడ వాడితే వాటిని అత్తింటికి తీసుకు రాకూడదట. అది ఎంత విలువైనా సరే ఒకసారి వాడితే మెట్టింటికి తీసుకు రావద్దు. ఒకవేళ అలాంటి పూజా వస్తువులు ఏవైనా తీసుకెళ్లే అటు పుట్టింటికి, అత్తింటికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా పుట్టింట్లో కష్టాలు మొదలవుతాయట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News