Ponnambalam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. కానీ చిరంజీవి మంచితనం గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. తెలిసిన పెద్దగా ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు. దీనికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. ఒక హీరోని ఇష్టపడే అభిమానులు ఎలా ఉంటారో, అలానే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు.
అయితే మెగాస్టార్ చేసిన ఎన్నో పనులు చాలామందికి తెలియనివ్వలేదు. కొంతమంది కొన్ని ఇంటర్వ్యూస్ లో చెబితే గాని ఆ విషయాలు బయటకు రావు. గతంలో పొన్నం బలం అనే ఒక తమిళ యాక్టర్ కు మెగాస్టార్ చిరంజీవి చేసిన హెల్ప్ గురించి అతని ఒక ఇంటర్వ్యూలో చెప్తే బయటపడింది. ఇప్పుడు తాజాగా మరో విషయాన్ని చెప్పాడు పొన్నం బలం.
కోటి రూపాయలు పైగా ఇచ్చారు
ఒక మనిషికి ఊరికే డబ్బులు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. ఎంతో పెద్ద మనసు ఉంటే కానీ డబ్బులు ఇవ్వరు. పొన్నం బలం మాట్లాడుతూ… ” నాకు జబ్బు చేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి కి ఫోన్ చేసి హెల్ప్ అడిగాను, ఆయన ఒక లక్ష రూపాయలు ఇస్తారు అని నేను అనుకున్నాను. కానీ ఇప్పటివరకు ఆయన కోటి రూపాయలకు పైగా ఇచ్చారు అంటూ తెలిపాడు. ఆగస్టు 2024లో పొన్నం బలం మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తన ట్రీట్మెంట్ కోసం 60 లక్షలు ఖర్చుపెట్టారు అని చెప్పారు.” కానీ ఈ కోటి రూపాయలకు పైగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చారు అనేది లేటెస్ట్ న్యూస్. అయితే ఈ విషయాలు ఏమీ పెద్దగా బయటకు రాలేదు.
ఎన్నో సినిమాలతో గుర్తింపు
ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించారు కానీ ఒకప్పుడు చాలా సినిమాల్లో పొన్నం బలం విలన్ పాత్రలో కనిపించేవారు. ఎన్నో సినిమాల్లో ఈయన నటించిన తీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. విలన్ ని చూడగానే భయం కలుగుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పొన్నం బలం. కేవలం తమిళ్ లో మాత్రం కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు పొన్నం బలం. మెగాస్టార్ చిరంజీవి ఇలా సహాయం చేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కేవలం మెగాస్టార్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ కూడా అంతే స్థాయిలో హెల్ప్ చేశారు. ఈ విషయాన్ని నటుడు కాదంబరి కిరణ్ పలు సందర్భాలలో చెప్పారు.
Also Read : Bigg Boss season 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నవదీప్ ఆవేశం, జడ్జ్ గా స్టార్ డైరెక్టర్ లీకైన వీడియో