BigTV English

Bigg Boss season 9: బిగ్ బాస్ హౌస్ కి ఆ స్టార్ డైరెక్టర్, ఇదేమి ఖర్మ సామీ?

Bigg Boss season 9: బిగ్ బాస్ హౌస్ కి ఆ స్టార్ డైరెక్టర్, ఇదేమి ఖర్మ సామీ?

Bigg Boss season 9: తెలుగులో ఎన్ని రియాలిటీ షో లు వచ్చిన వాటన్నిటి కంటే ప్రత్యేకంగా ఒక మెట్టు పైనే ఉంటుంది బిగ్ బాస్. బిగ్ బాస్ ని విపరీతంగా ఇష్టపడే జనాలు ఉన్నారు. అలానే ఆ షో పైన ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎలా చూస్తారురా అంటూ కొంతమంది విపరీతంగా కామెంట్స్ చేస్తారు. ఎక్కడలేని చెత్తంతా తీసుకొచ్చి టీవీలో చూపిస్తున్నారు అని కొంతమంది విపరీతంగా అప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.


ఇక తెలుగులో చాలామంది ఈ షో బ్యాన్ చేయాలి అంటూ నినాదాలు కూడా చేశారు. అయితే ఈ షో మొదట తెలుగులో వచ్చినప్పుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాతిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ మొదటి సీజన్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత నాని కూడా అదే స్థాయిలో అందరినీ ఆకట్టుకున్నారు. నాగర్జున వచ్చిన తర్వాత అది తిరుగులేకుండా ముందుకు వెళ్లిపోయింది. ఒకప్పుడు బిగ్ బాస్ కి తెలిసిన కంటెస్టెంట్ లు వచ్చేవాళ్ళు. అని ఇప్పుడు మాత్రం తెలుసుకోవాల్సిన కంటెస్టెంట్లు వస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ ఎంట్రీ 


బిగ్ బాస్ షో కు ఒక స్టార్ డైరెక్టర్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఆ స్టార్ డైరెక్టర్ కంటెస్టెంట్ గా రావడం లేదు. కంటెస్టెంట్ ను సెలెక్ట్ చేయడానికి వచ్చారు. అతను మరెవరో కాదు దర్శకుడు తేజ. చిత్రం సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టిన తేజ ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు తీశారు. ఇప్పటికీ కూడా యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు.

అయితే సామాన్యుడని ఈ షోలో కంటెస్టెంట్ గా తీసుకోవడానికి పిలుపును ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ 9. చాలా అప్లికేషన్ రావడంతో, వాటిలో ఒక 40 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 40 మందిలో ఒకరిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలి. దానికి అగ్నిపరీక్ష అని పేరు పెట్టారు. అయితే ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే బాధ్యతను దర్శకుడు తేజ పైన కూడా పెట్టారు.

వీళ్లు మాత్రమే బయటకు వచ్చారు 

ముఖ్యంగా అగ్ని పరీక్షలో బిందు మాధవి, నవదీప్, అభిజిత్ వీళ్ళ ముగ్గురు ఒక కంటెంట్ ను ఎన్నుకుంటారు అనే ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే వీళ్ళు పేర్లు బయటికి వచ్చాయి కానీ తేజ పేరు బయటికి రాలేదు. ప్రస్తుతం ఈ వార్తతో షో మీద క్యూరియాసిటీ మరింత పెరుగుతుంది. చాలామంది ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. ఈ షో వచ్చిన తర్వాత ఇంకొంతమంది సెలబ్రిటీలు కూడా పుట్టుకొస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.

Also Read: Coolie : సీఎంను కలిసిన కూలీ చిత్ర యూనిట్, వాట్ బ్రో అంటున్న విజయ్ ఫ్యాన్స్

Related News

Bigg Boss season 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నవదీప్ ఆవేశం, జడ్జ్ గా స్టార్ డైరెక్టర్ లీకైన వీడియో

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Big Stories

×