Dinda Academy Trolls : సాధారణంగా బౌలర్ ఒక ఓవర్ లో ఎక్కువ రన్స్ ఇస్తే.. లేదా ఆ స్పెల్ లో ఎక్కువ రన్స్ ఇస్తే.. అతన్ని దిండా అకాడమీ పేరుతో ట్రోల్ చేస్తారు. అసలు ఈ ఇండియన్ బౌలర్ దిండా ఏం తప్పు చేశాడు..? ఎందుకు అతన్ని ట్రోల్స్ చేస్తున్నారంటే..? తాను రిటైర్మెంట్ అయిన ఏళ్ల తరువాత కూడా అతన్ని ట్రోల్స్ చేస్తున్నారు. వాస్తవానికి అశోక్ దిండా టీమిండియా బౌలర్. తాను ఐపీఎల్ లో తొలిసారిగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. అప్పుడు తన బౌలింగ్ మంచిగానే ఉండేది. కానీ తన ఎకానమీ నార్మల్ బౌలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండేది. అయితే అప్పట్లో ఎకానమీని చాలా వరస్ట్ గా చూస్తుండేది. కానీ అశోక్ దిండా రికార్డు ఎప్పుడు కరాబ్ అయిందంటే..? 2017 ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా ఒకటే ఓవర్ లో 30 రన్స్ కొట్టాడు. దాని తరువాత ఏ మ్యాచ్ లో అయినా ఎక్స్ పెన్సివ్ ఓవర్ వేస్తే.. ఎవరైనా బౌలర్ ఎక్కువ రన్స్ ఇస్తే.. తనను దిండా అకాడమీ పేరుతో ట్రోల్ చేస్తారు.
Also Read : Nithish Kumar Reddy : మహేష్ కోసం త్యాగం.. కొత్త టాటూలతో రెచ్చిపోయిన నితీష్ కుమార్ రెడ్డి
అప్పటి నుంచే ట్రోల్స్
అయితే అశోక్ దిండా ఒక మంచి బౌలర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తన పేరిట 400 పైగా వికెట్లు తీశాడు. కానీ ఐపీఎల్ లో ఎప్పుడైతే 30 పరుగులు సమర్పించుకున్నాడో అప్పటి నుంచి ఇప్పటివరకు అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు తనపై చేస్తున్న ట్వీట్స్, ట్రోల్స్ కి టీమిండియా ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా గట్టిగానే బదులిచ్చాడు. అప్పట్లో తనపై వచ్చిన ట్వీట్, ట్రోల్స్ తో విసిగిపోయిన దిండా పేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. హేటర్స్.. నా ఈ లెక్కలు చూడండి. నాపై అనవసరంగా నోరు పారేసుకోవడం ఆపండి. మీ నోటి నుంచి నాపేరు రానివ్వకండి అంటూ కామెంట్స్ పెట్టడంతో తాను నమోదు చేసిన గణాంకాలతో కూడిన ఫొటోను కూడా షేర్ చేశాడు దిండా.
తొమ్మిదేళ్ల కృషి..
మరోవైపు అశోక్ దిండా తన ఆవేదన సైతం వెల్లగక్కాడు. ఈ ప్రపంచంలో నేను అంత గొప్ప బౌలర్ ని కాదని.. తెలుసు. కానీ ఈ ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే..? ” నేను క్రికెటర్ ని అయ్యేందుకు ఎంత కష్టపడ్డానో.. నా క్రికెట్ కెరీర్ కి నా కుటుంబం మద్దతు తెలపలేదు. రంజీ ట్రోఫీలో బెంగాళ్ కి ఆడుతున్నానంటే అది నా తొమ్మిదేళ్ల కృషి అని తెలిపాడు. ఎన్నో రోజులు క్రికెట్ మైదానాలలో పడుకున్నాను. కొన్ని రోజులు తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు. నాకు మద్దతివ్వడం మీకు ఇస్టం లేకుంటే వదిలేయండి. కానీ నా ఆటను మాత్రం అవమానించకండి. ఎందుకంటే క్రికెట్ ఆడటానికి రేయింబవళ్లు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు” అని దిండా ఆవేదన చెందాడు.
?igsh=MXZtZTJrbGxpejM5Yg==