Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 14వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: రుణ బాధలు అధికం. మిత్ర ద్రోహం. బంధువుల తాకిడితో సతమతమవుతారు. అనుకోకుండా హఠాత్తుగా అధికారులతో సమావేశాలు జరుపుతారు. సోదరీమణులు ఆర్థికంగా ఆదుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చేయండి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 5
కలిసి వచ్చేరంగు: కపిలవర్ణం
ఆదిత్య హృదయం పారాయణ చేయండి.
వృషభరాశి: మీ మాటలతో ఎదుటివారిని బురిడీ కొట్టిస్తారు. ఎవరికీ అంతుచిక్కని ప్రవర్తనతో అతి రహస్యంగా పనులు పూర్తి చేస్తారు. అధికార లాభం, ఆర్థిక లాభాలు ఉన్నాయి. సోదరులకు మీ సహాయ సహకారాలు అందజేస్తారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 6
కలిసివచ్చే రంగు: తెలుపు
మహాలక్ష్మీ అష్టోత్తరం చదవండి.
మిథునరాశి: శుభస్య శీఘ్రం అన్నట్టుగా అనుకున్న పనులు వెంట వెంటనే ప్రారంభిస్తారు. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతారు. ఆనందంగా గడుపుతారు. కొన్ని పనుల్లో అవరోధాలు ఎదురైనా సంకల్పంతో సాధిస్తారు. పితృవర్గం తరుపున ఆస్తిలాభం కలుగుతుంది. భూ విక్రయాలు కలిసి వస్తాయి. నరఘోష అధికంగాఉంటుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 8
కలిసి వచ్చేరంగు: ఎరుపురంగు
సుబ్రహ్మణ్య స్వామి దర్శనం శుభం.
కర్కాటకరాశి: ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సమయానుసారంగా సంప్రదించాల్సిన వైద్యులను కలవండి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆహార నియమాలు పాటించండి. పెంపుడు జంతువులతో గడపండి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4
కలిసి వచ్చేరంగు: పసుపు పచ్చరంగు
నానపెట్టిన శనగలు గోవుకి తినిపించండి.
సింహరాశి: ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటారు. దూరమయిన బంధాలు చేరువవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. ఓపికతో నడుచుకోవడం మంచిది. సహధర్మచారిణితో నిజాయితీగా వ్యవహరించండి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 3
కలిసి వచ్చేరంగు: నీలంరంగు
వేంకటేశ్వరస్వామిని దర్శించుకోండి పచ్చకర్పూరం సమర్పించండి.
కన్యారాశి: కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్ర సమాగమం. విశేషమైన మానసికానందాన్ని కలిగిస్తుంది. కండరాలకు సంబంధించిన వ్యాధితో ఇబ్బందులు పడుతారు. ముఖ్యమైన చర్చలు ఫలిస్తాయి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 5
కలిసి వచ్చేరంగు: ఆకుపచ్చ రంగు
కనకదుర్గాదేవి దర్శనం శుభం.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: ముఖ్య వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయండి. శతృవులు అధికం ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3
కలిసి వచ్చేరంగు: తెలుపు రంగు
వేపచెట్టుకి చక్కర కలిపిన పాలు పోయండి.
వృశ్చికరాశి: నూతన గృహ నిర్మాణ పనులు చేపడతారు. వస్తు లాభం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అర్హత సాధిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. భాగస్వామి సలహాలు పాటించండి. ఇతరులకు మాటిచ్చేటప్పుడు ఆలోచించుకోండి. మధ్యవర్తిత్వం నష్టాలు తెచ్చిపెడుతుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4
కలిసి వచ్చేరంగు: గంధం రంగు
దుర్గాదేవి ఆలయంలో 18 నిమ్మకాయలతో కూడిన దండ సమర్పించండి.
ధనస్సురాశి: కోర్టు వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. భార్య తరుపున రావాల్సిన ఆస్తి చేతికి అందుతుంది. కొన్ని పొరపాట్ల వలన చిక్కుల్లో పడుతారు. గండకాలం పొంచి ఉంది. అందరికీ దూరంగా ఉండాలని భావిస్తారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3
కలిసి వచ్చేరంగు: కాషాయం రంగు
శివాలయ దర్శనం మంచిది
మకరరాశి: దూర ప్రయాణాలపై ఆసక్తి చూపిస్తారు. అకారణంగా వాగ్వాదాలు జరుగుతాయి. ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంది. బంధువులతో మర్యాదగా ప్రవర్తించండి. భార్య (భర్త) తరుపు వారితో గొడవలు జరుగుతాయి. మృత్యు గండం వెంటాడుతుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 8
కలిసి వచ్చేరంగు: లేత నీలంరంగు
గోధుమ పిండి ఉండలు చేపలకు ఆహారంగా సమర్పించండి.
కుంభరాశి: మొండి వైఖరితో ప్రవర్తిస్తారు. అకారణంగా ఇతరులతో గొడవకు దిగుతారు. ఎదుటి వారు చెప్పింది వినిపించుకోరు. పదునైన ఆయుధాల వల్ల గాయాలు ఏర్పడుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 3
కలిసి వచ్చేరంగు: వైలెట్ కలర్
వినాయకున్ని పూజించండి.
మీనరాశి: గ్రహబలం ఉంది. మీ ఎదుగుదల ఇతరులకు అసూయ కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. చేపట్టిన పనులలో ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. ఒక సమయంలో తీవ్ర వైరాగ్యానికి గురవుతారు. ఆధ్యాత్మిక గురువులను కలుసుకుంటారు. వారి సలహాలు తీసుకుంటారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య 8
కలిసి వచ్చేరంగు: కాషాయం రంగు
రావిచెట్టుకు 18 ప్రదక్షిణలు చేసి ఆవు పాలు కలిపిన నవధాన్యాలను చెట్టు దగ్గర వదిలి వేయండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే