Chanakya Niti: చాణక్యుడు చెప్పిన విషయాలు ఎంతో మంది ఫాలో అవుతుంటారు. రాజుల పోయారు.. రాజ్యాలు పోయాయి కానీ చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇంకా ట్రెండింగ్ లోనే ఉన్నాయి. అంటే ఆయన చెప్పిన మాటలు ఎంత పవర్ ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంటి పెద్ద ఎలా ఉంటే ఆ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆ ఇంట్లో ఎప్పటికీ ధనానికి లోటు ఉండదే కూడా చాణక్యుడు చెప్పారు. ఇప్పుడు ఈ కథనంలో ఆ విషయాలు తెలుసుకుందాం.
ఇతరుల మాటలు వినకూడదు: కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని ఎప్పుడూ అనమతించకూడదు. ఇతరులు చెప్పే విషయాలు ఏవీ పట్టించుకోకూడదు. కుటుంబ సభ్యుల గురించి ఇతరులు మాట్లాడే విషయాలను అవైడ్ చేయాలి. అసలు ఇతరులు మీ కుటుంబ విషయాల గురించి మీతో చర్చించేంత చనువు ఇవ్వకూడదు.
పుకార్లను నమ్మకూడదు: మీ గురించి మీ కుటుంబ సభ్యుల గురించి ఇతరులు చెప్పే పుకార్లను అసలు నమ్మకూడదు. ఒకవేళ మీ ఇంట్లో సభ్యులు ఏదైనా విషయంలో తప్పు చేసినా అది ఇతరులు మీ ముందు చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్లను మీరు సమర్థించుకోవాలి అలాంటి తప్పు వారు చేసి ఉండరని చెప్పాలి అంటే కానీ బయటి వ్యక్తుల మాటలు విని ఇంట్లో వాళ్లను ఎప్పుడూ నిందించకూడదు. తప్పు చేసి ఉంటే ఆ తప్పు ఎందుకు చేశారో తెలుసుకోవాలి. అలాంటి తప్పు మరోసారి రిపీట్ కాకుండా చూడాలి. సున్నితంగా నచ్చజెప్పాలి.
ఇంటి సభ్యులతో స్పష్టంగా మాట్లాడాలి: కుటుంబ సభ్యులతో ఎటువంటి సందర్భంలోనైనా స్పష్టంగా మాట్లాడాలి. మనసులో ఒక ఉద్దేశం ఉంటే బయటకు వేరే ఉద్దేశంతో మాట్లాడటం అసలు చేయకూడదు. అలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చి అవి కుటుంబాన్నే చిన్నాభిన్నం చేయోచ్చట. అందుకే ఎంటువంటి సందర్భంలోనైనా కుటుంబ సభ్యులతో అరమరికలు లేకుండా స్పష్టంగా మాట్లాడాలని చాణక్య నీతిలో ఉంది.
డబ్బును వృథా చేయరాదు: ఇంటి యజమాని ఎట్టి పరిస్థితుల్ల డబ్బును వృథా చేయరాదు. ఇలా చేయడం వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. అలాగే ఇంటి పెద్దే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు కూడా డబ్బు విలువ పట్టించుకోకుండా ఉంటారు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతుంది.
డబ్బ నిర్వహణపై అవగాహన కల్పించాలి: కుటుంబ సభ్యులకు డబ్బు నిర్వహణపై అవగాహన కల్పించాలి. ఎవరైనా దుబారా ఖర్చు చేస్తుంటే వారికి ఆ ఖర్చు చేయడం వల్ల కలిగే ఆర్థిక నష్టాలను గురించి సున్నితంగా వివరించాలి. పొదుపు ఎలా చేయాలో నేర్పించాలి. డబ్బే డబ్బును సంపాదింస్తుందన్న సూత్రాన్ని ఒంటబట్టించాలి.
అందరినీ సమానంగా చూడాలి: కుటుంబంలోని సభ్యులందరినీ ఇంటి పెద్ద ఎట్టి పరిస్థితుల్లోనైనా సమానంగా చూడాలి. ఒకర్ని ప్రేమగా మరొకరిని కోపంగా చూస్తుంటే ఆ ఇంట్లో గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలే ఆ ఇంటి పతనానికి కారణం అవుతాయి. కొన్ని సందర్భాలలో తప్పు చేసిన వ్యక్తిని వెనకేసుకు రావడం కొన్ని సందర్బాలలో ఏ తప్పు చేయని వ్యక్తిని దూషించడం లాంటివి చేయకూడదు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష ఒకేలా ఉండాలి.
క్రమశిక్షణ : ఇంట్లో సభ్యులందరికీ ముఖ్యంగా క్రమశిక్షణ నేర్పించాలి. ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండటం లాంటి విషయాలను ఇంటి పెద్ద ఎప్పటికప్పుడు నేర్పించాలి. అలాగే ఎవరి పనులు వాళ్లు చేసుకోవడం లాంటి విషయాల్లో ఇంటి పెద్ద నేర్పిస్తుండాలి.
సరైన నిర్ణయాలు తీసుకోవడం: ఇంటి సంక్షేమం కోసం కుటుంబ పెద్ద సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటి అభివృద్ది కోసం వృత్తి, వ్యాపారాలు చేయడం. ఇంట్లో పిల్లలకు మొదటి నుంచి స్వయంకృషితో బతికేలా నేర్పించాలి.
సామూహిక పూజ చేయడం: ఇంట్లో అందరూ కలిసి ప్రతిరోజు దేవుడి ముందు కూర్చుని పూజ చేయాలి. అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేస్తుందట. ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.