Cristiano Ronaldo : ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాలర్, పోర్చుగీస్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన దీర్ఘకాలిక ప్రేయసి జార్జినా రొడ్రిగ్జ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట ఎనిమిదేళ్ల ప్రేమ, ఐదుగురు పిల్లల పెంపకం తరువాత తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. రొనాల్డోతో ఎంగేజ్ మెంట్ విషయాన్ని జార్జినా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. రొనాల్డో-జార్జినా ఇప్పటికే ఇద్దరూ పిల్లలకు తల్లిదండ్రులు. అలానా మార్టినా 2017, బెల్లా ఎస్మెరాల్డ 2022లో జన్మించారు. వీరిలో క్రిస్టియానో రొనాల్డో జూనియర్ రొనాల్డో మొదటి భార్య కుమారుడు. క్రిస్టియానో రొనాల్డో జూనియర్ తరువాత రొనాల్డో సరోగసీ ద్వారా ఇద్దరూ పిల్లలను కన్నాడు. ఎవా మారియా మటేయో అనే వీరు 2017లో జన్మించారు. వీరి తరువాత రొజాల్డో జార్జినాతో అలానా మార్టినా, బెల్లా ఎస్మెరాల్డా, అంజెల్ ను కన్నాడు. అయితే బెల్లా ట్విన్ బ్రదర్ అయిన అంజెల్ జన్మ సమయంలోనే మరణించాడు.
రొనాల్డో-జార్జినా లవ్ స్టోరీ
రొనాల్డో-జార్జినా 2016లో మాడ్రిడ్ లోని Gucci షాప్ లో తొలిసారి కలుసుకున్నారు. 2017 ఫిపా అవార్డు ప్రదానోత్సవంలో వీరిద్దిరూ మొదటిసారి పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చారు. జార్జినా రొడ్రిగ్జ్ అర్జెంటినా కి చెందిన ప్రముఖ మోడల్, ఫ్యాషన్ ఇన్ ప్లుయెన్సర్, ఎంటర్ టైనర్, వ్యవసాయదారురాలు. ఆమె జీవిత ప్రయాణం సాధారణ వెయిట్రెస్ ఉద్యోగంతో ప్రారంభమైంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో I AM Georgina అనే డాక్యుమెంటీతో బాగా పాపులర్ అయింది. ఇక క్రిస్టియానోో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఎనిమిది సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఈ విషయాన్నని జార్జినా సోషల్ మీడియా వేదిక గా వెల్లడించింది.
నిశ్చితార్థంలో జార్జినా చేతికి ఖరీదైన ఉంగరం
మరోవైపు నిశ్చితార్థంల ఆమె చేతికి రొనాల్డో ఉంగరం తొడిగాడు. అయితే ఆ ఉంగరం చాలా ఖరీదైనదిగా తెలుస్తోంది. వజ్రాలతో పొదగబడిన ఈ రింగ్ విలువ మూడు మిలియన్స్ అంట. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.26.30 కోట్లు ఉంటుందని సమాచారం. 2016లో కలుసుకున్న సమయంలో జార్జినా ఒక గూచీ దుకాణంలో సేల్స్ గర్ల్ గా పని చేస్తుండేది. అప్పుడు వారి మధ్య మొదలైన పరిచయం స్నేహంగా మారి ఆ తరువాత ప్రేమగా మారింది. 2017 నుంచి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. పెళ్లి కాక ముందే ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. 2022లో ఈ జంట కు కవలలు జన్మించారు. వారిలో మగపిల్లాడు మరణించాడు. అయితే క్రిస్టియానో పెద్దకుమారుడు జూనియర్ క్రిస్టియానో 2010లో మొదటి భార్య కి జన్మించాడు. అయితే అతని తల్లి ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు రొనాల్డో వెల్లడించలేదు. అతను కూడా వీరితో పాటే ఉంటున్నాడు. ప్రస్తుతం రొనాల్డో కి పెళ్లి కాకముందే నలుగురు పిల్లలు ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.