E-Paper
Advertisement

Coolie : సీఎంను కలిసిన కూలీ చిత్ర యూనిట్, వాట్ బ్రో అంటున్న విజయ్ ఫ్యాన్స్

Coolie : సీఎంను కలిసిన కూలీ చిత్ర యూనిట్, వాట్ బ్రో అంటున్న విజయ్ ఫ్యాన్స్
Advertisement

Coolie : ఎప్పటినుంచి ఎదురు చూస్తున్న కూలీ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు వస్తుంది. చాలా ఏళ్లు తర్వాత రజనీకాంత్ నటించిన ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. దీని కారణం దర్శకుడు లోకేష్ కనగరాజ్. ముఖ్యంగా ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నుండి అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది.

రజనీకాంత్ తో పాటు పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపించటం సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచింది. నమ్మకాన్ని మించి ఇంతమంది స్టార్ హీరోలని ఎలా డీల్ చేశాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే అలా డీల్ చేయటం లోకేష్ కి కొత్త కాదు. ఈ సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్క స్టార్ ని తీసుకొచ్చి ఈ సినిమాలో ఇంక్లూడ్ చేశాడు.

Advertisement

సీఎంను కలిసిన కూలీ చిత్ర యూనిట్ 

ఒక సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండాలి. కూలీ సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి సపోర్టు లభించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉదయాన్నే షోస్ మొదలుకానున్నాయి. ఇక చిత్ర యూనిట్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశారు. ఈ ఫోటోను లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఉదయనిది స్టాలిన్ పొద్దున ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం చిత్ర యూనిట్ సీఎం స్టాలిన్ (Stalin) ను కలవడంతో కొంతమంది విజయ్ ఫ్యాన్స్ వాట్ బ్రో అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

విజయ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ 

తమిళ రాజకీయాల్లో విజయ్ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళ వెట్రి కలగం పార్టీ (Tamila Vetri Jalagam) విజయ్ కూడా పోటీ చేయబోతున్నారు. ఈ తరుణంలో లోకేష్ సీఎం ని కలవడంతో విజయ్ ఫేమస్ డైలాగ్ “వాట్ బ్రో, ఇట్స్ వెరీ రాంగ్ బ్రో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇదే వేరే వాళ్ళకి సెటైర్ గా వాడారు విజయ్. ఇక లోకేష్ విషయానికి వస్తే అందరితోనూ మంచి బాండింగ్ ఉంది. ఇప్పటికే విజయ్ తో రెండు సినిమాలు చేశాడు. ఆ సినిమాలకు సంబంధించి ఇంకో సీక్వెల్ చేయాలి అంటే విజయ్ తో తప్ప ఇంకెవరితో చేయను అని పలు ఇంటర్వ్యూస్ లో కూడా తెలిపాడు లోకేష్. అలానే లోకేష్ ఫోటో కింద పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ వేరే సినిమా కోసం వేసిన గెటప్ పైన కామెంట్స్ వస్తున్నాయి.

Also Read: Ponnambalam : నేను లక్ష రూపాయల కోసం ఫోన్ చేస్తే చిరంజీవి కోటికి పైగా ఇచ్చారు

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×