Arjun Tendulkar: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొంది. పెళ్లి అనగానే అందరూ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ వివాహమే అని అనుకుంటారు. అలా అనుకుంటే తప్పులో కాలు వేసినట్టే అవుతుంది. సచిన్ టెండుల్కర్ ఏకైక కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్ తాజాగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని చాలా రహస్యంగా జరిపారని సమాచారం అందుతుంది. నేషనల్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ సీక్రెట్ ఎంగేజ్మెంట్
టీమిండియా మాజీ, లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో ఉంటూ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు సచిన్ టెండూల్కర్. ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ ను.. క్రికెట్ చూసే ప్రతి అభిమాని గుర్తుపెట్టుకుంటారు.. క్రికెట్ గాడ్ గా సచిన్ టెండుల్కర్ ఎదిగారు. అయితే అలాంటి టీమిండియా స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా జరిగినట్లు చెబుతున్నారు. ముంబై వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్ తో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం అందుతోంది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలోనే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారట సచిన్ టెండూల్కర్. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. నేషనల్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో సచిన్ టెండూల్కర్ అభిమానులు షాక్ అవుతున్నారు.
కెరీర్ లో సతమతమవుతున్న సచిన్ కొడుకు అర్జున్
లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ టీమిండియాలో దుమ్ము లేపాడు. కానీ ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం… క్రికెట్ లో పెద్దగా రాణించడం లేదు. సచిన్ టెండుల్కర్ ముఖం చూసి చాలామంది అవకాశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు అర్జున్ టెండూల్కర్ మెరిసిన సందర్భాలు లేవు.
సచిన్ టెండూల్కర్ లాగా కాకుండా… ఆల్ రౌండ్ పాత్ర పోషిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్. లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ జట్టు… బేస్ ధరకే సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేస్తూ ఉంటుంది. అయితే ఆమాత్రం జట్టులోకి తీసుకుంటే… ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఏమాత్రం… తుది జట్టులో ఛాన్స్ ఇవ్వదు. అలా చాలాసార్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ఒక్కసారి కూడా అర్జున్ టెండూల్కర్ కు అవకాశం రాలేదు. కేవలం సచిన్ టెండూల్కర్ ముఖం చూసి… అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేస్తుందని ఇప్పటికి ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఐపీఎల్ అయిన తర్వాత దేశవాళి క్రికెట్ లో అర్జున్ టెండూల్కర్ ఆడుతూ ఉంటాడు.