BigTV English

Bigg Boss season 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నవదీప్ ఆవేశం, జడ్జ్ గా స్టార్ డైరెక్టర్ లీకైన వీడియో

Bigg Boss season 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నవదీప్ ఆవేశం, జడ్జ్ గా స్టార్ డైరెక్టర్ లీకైన వీడియో

Bigg Boss season 9 : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ను చాలామంది ఆదరిస్తారు. అంతమంది ఆదరిస్తారు కాబట్టి ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం తోమిదో సీజన్ మొదలుపెట్టబోతుంది. అయితే ఈ షోకు సంబంధించి మొదట హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. తర్వాత సీజన్లో నాని రంగంలోకి దిగారు. ఆ తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున ఎంట్రీ ఇచ్చిన తర్వాత తొమ్మిదవ సీజన్ వరకు ఎగ్జిట్ ఇవ్వలేదు.


అయితే ప్రతి సీజన్ ఒకదాన్ని మించి ఒకటి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రియాలిటీ షో మేనేజ్మెంట్. మొదటి షోకి చాలామంది తెలిసిన గెస్ట్లు వచ్చారు. ఆ తర్వాత కాలంలో మిగిలిన సీజన్స్ కి వచ్చిన గెస్ట్లు ఎవరు అని తెలుసుకోవాల్సిన పరిస్థితి. కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూడు రోజులకే అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తది. చూసే ఆడియన్స్ కి అప్పుడే అసలైన కిక్ స్టార్ట్ అవుద్ది.

అగ్ని పరీక్షలో ఆవేశం 


బిగ్బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ తో పాటు ఒక సామాన్యుడిని తీసుకుంటున్నాం అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సామాన్యులుగా ఎంట్రీ ఇవ్వాలి అని దాదాపు చాలామంది అప్లికేషన్ పెట్టారు. ఒక 20 వేల మంది అప్లికేషన్ పెడితే, దాదాపు 40 మందిని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ 40 మందిలో ఒక్కరు ఎవరు అనేది అసలైన టాస్క్.

ఆ ఒక్కడిని సెలెక్ట్ చేయడానికి నవదీప్, బిందు మాధవి, అభిజిత్ వీళ్లు ముగ్గురు జడ్జిలుగా వ్యవహరించారు. బిగ్ బాస్ షో గురించి ఎప్పుడూ లీక్స్ వస్తూనే ఉంటాయి. ఈసారి డైరెక్ట్ గా వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో జడ్జి స్థానంలో వాళ్ళ ముగ్గురు కనిపిస్తున్నారు. అయితే నవదీప్ చాలా ఆవేశంతో అరవడం అనేది ఊహించని సంఘటన.దీనిని బట్టి చూస్తుంటే సీజన్ 9 గట్టిగానే ప్లాన్ చేశారు అనిపిస్తుంది.

గతంలో బిందు మాధవి, అభిజిత్ షో లో గెలిచారు కాబట్టి, ఇటువంటి పరిస్థితి లో ఎలా బిహేవ్ చేయాలో వాళ్లకు ఒక క్లారిటీ ఉంది కాబట్టే, మేనేజ్మెంట్ ఈ అగ్నిపరీక్షను వాళ్లకు అప్పజెప్పింది. ఈ అగ్నిపరీక్షను దాటిన వాడే బిగ్ బాస్ సీజన్ 9 లో సామాన్యుడిగా ఎంట్రీ ఇస్తాడు.

జడ్జిగా స్టార్ డైరెక్టర్ 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న దర్శకుడు తేజ. చిత్రం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తేజ మొదటి సినిమాతోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అలానే ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత తేజకు ఉంది. కొన్ని సందర్భాల్లో తేజ మాట్లాడే మాటలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. బహుశా అన్ని విషయాల పైన తేజకు అవగాహన ఉండటం వలన కావచ్చు, ఒక జడ్జ్ గా తేజ ను కేటాయించారు అని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం వినిపిస్తుంది.

Also Read: Nani On Coolie: రజనీకాంత్ కంటే నాగార్జున కోసమే ఎదురుచూస్తున్న – నాని

Related News

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Big Stories

×