Nani On Coolie: సౌత్ సినిమా ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తున్న సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళం స్టార్ హీరో సౌబిన్, బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇంతమంది స్టార్ కాస్ట్ సినిమాలో ఉండడం బట్టి సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
గతంలో లోకేష్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ నటించారు. అయితే ఈ రెండు క్యారెక్టర్ లను కూడా చాలా అద్భుతంగా డీల్ చేశాడు. ఇప్పుడు వాళ్లను మించి సినిమా చేస్తున్నాడు కాబట్టి క్యూరియాసిటీ ఇంకా పెరిగింది.
నాగార్జున కోసమే వెయిటింగ్
రేపు రెండు భారీ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వస్తున్న తరుణంలో చాలామంది ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని కూడా వార్ 2 & కూలీ సినిమాలు గురించి ట్వీట్ చేశాడు. హృతిక్ రోషన్ సార్ తో పాటు తారక్ అదిరిపోయేలా చేస్తాడు. రజినీకాంత్ ను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని ఎందుకు అంటారు మరోసారి ప్రూవ్ చేస్తారు. కానీ నేను ఎదురు చూస్తున్నది ఏంటంటే నాగార్జున గారు మొదటిసారి విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. దానిపై నాకు మంచి క్యూరియాసిటీ ఉంది. మొత్తానికి సినిమా లవర్స్ కి ఇది ఒక పెద్ద పండుగ. ఎవరు గెలుస్తారు అని కాదు. సినిమా గెలుస్తుంది అని నాని ట్వీట్ చేశాడు.
Tomorrow I am sure Taarak will ace it along with Hrithik sir like he always does.
Tomorrow I am sure Rajini sir is going to show the world why he is THE GOAT. But what I am most excited is to watch Nagarjuna sir unleash in a negative role for the first time. It’s going to be a…— Nani (@NameisNani) August 13, 2025
నాని కూడా ఒక అభిమాని
రజనీకాంత్ కి అభిమాని కాని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. రజనీకాంత్ అంటే ప్రతి సెలబ్రిటీ కి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కొంతమంది సెలబ్రిటీలు రజినీకాంత్ ని ఇమిటేట్ కూడా చేస్తారు. ముఖ్యంగా శివ కార్తికేయన్ రజినీకాంత్ ను అలా దించేస్తాడు. చాలామంది తెలుగు హీరోలు కూడా కొన్ని సినిమాల్లో రజినీకాంత్ ను రిఫరెన్స్ గా వాడుకుంటారు. ముఖ్యంగా ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రజనీకాంత్ రిఫరెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అంతేకాకుండా ఆ సినిమాలో ప్రభాస్ రజనీకాంత్ అభిమాని. చాలా ఏళ్లు తర్వాత రజనీకాంత్ సినిమాకు ఈ రేంజ్ బజ్ క్రియేట్ అయింది అంటే కారణం అశోకుడు లోకేష్ కనగరాజ్. సినిమాకి సంబంధించి బుకింగ్స్ కూడా అదిరిపోయాయి. మిగతా అంతా టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
Also Read: Krish Jagarlamudi: చైనా లాగా ఇక్కడ సాధ్యమవుతుందా? ఉన్న థియేటర్లకే దిక్కులేదు