BigTV English

TTD: నెలకు 100 కోట్లు.. వెంకన్నా నువ్ గ్రేటన్నా..

TTD: నెలకు 100 కోట్లు.. వెంకన్నా నువ్ గ్రేటన్నా..

TTD: తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ప్రపంచంలో ఉన్న అని దేవాలయాల్లో కంటే అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న రెండో ఆధ్యాత్మిక కేంద్రం. ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకుంటే పాపాలు, కష్టాలు, సమస్యలు తొలగిపోతాయని భావించే భక్తులంతా.. దర్శనం తర్వాత కానుకలు సమర్పించుకుంటారు. 14 నెలలుగా శ్రీవారి ఆదాయం పెరుగుతూనే ఉంది. వరుసగా 100 కోట్ల మార్క్‌ దాటింది.


తిరుమల ఏడుకొండలస్వామికి భక్తులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. వరుసగా 14వ నెలలోనూ తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల మార్క్‌ దాటింది. ఏప్రిల్ నెలలో శ్రీవారికి హూండీ ఆదాయం 114.12 కోట్లు వచ్చింది. గతేడాది మార్చి నుంచి శ్రీ వెంకటేశ్వర్ల స్వామి హుండీ ఆదాయం వరుసగా వంద కోట్లు మార్కు దాటుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమల శ్రీవారికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు రోజు లక్షల్లో జనం బారులు తీరుతారు. అలాంటి స్వామివారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ వస్తోంది.


1950 వరకూ శ్రీవారికి హుండీ ద్వారా రోజుకు లక్ష రూపాయల లోపు ఆదాయం లభించేది. 1958లో తొలిసారి లక్ష దాటింది. 1990ల నాటికి అది కోటి రూపాయలకు పెరగ్గా.. తర్వాత నుంచి క్రమంగా పెరిగింది. 2020-21లో 731 కోట్ల వార్షిక ఆదాయం రాగా.. గత ఆర్థిక సంవత్సరంలో అది మరింత పెరిగి 933 కోట్లకు చేరింది. దీంతో ఈ వార్షిక ఏడాదిలో అది వెయ్యి కోట్లు అవుతుందని అంచనా వేయగా.. మూడు నెలల ముందే ఆ అంచనా దాటడం విశేషం.

Related News

Jagan Press Meet: కాల్చి పారేస్తా నా —. జగన్ రియాక్షన్ ఏంటంటే?

Heavy Rains in AP: బాబోయ్ .. కుమ్మేస్తున్న వానలు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

Pulivendula Politics: జగన్‌కు కూటమి కౌంటర్.. బాయ్ కాట్ కాదు, బావిలో పడండి

Jagan on Pulivendula: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?

AP Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త జీవో పూర్తి వివరాలు..

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Big Stories

×