E-Paper
Advertisement

No layoffs at Apple : అందరిదీ ఓ లెక్క.. ఆపిల్‌ది మరో లెక్క!

No layoffs at Apple : అందరిదీ ఓ లెక్క.. ఆపిల్‌ది మరో లెక్క!
Advertisement

No layoffs at Apple : గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, ట్విట్టర్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌… ఇలా దిగ్గజ కంపెనీలన్నీ ఆర్ధిక మాంద్యం భయాలతో వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఉద్యోగ కోతలు ఆగవని సంకేతాలిస్తున్నాయి. కానీ… ఒక్క ఆపిల్ మాత్రమే ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగినీ తీసేయలేదు… తీసేస్తామని ప్రకటించనూ లేదు. దాంతో… ఇది ఆ కంపెనీకి ఎలా సాధ్యమైందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.

Advertisement

కరోనా సమయంలో చాలా కంపెనీలు… బలమైన వృద్ధిని నమోదు చేశాయి. డిమాండ్ మేరకు ఉద్యోగులను భారీ సంఖ్యలో నియమించుకున్నాయి. నిరుడు జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ ఏకంగా 2 లక్షల ఉద్యోగుల్ని నియమించుకుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. ఇక అమెజాన్ 2021లో మూడు లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది. 2020తో పోలిస్తే ఇది 38 శాతం అధికం. 2020, 2021లో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా 13 వేల మందిని నియమించుకోగా, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 2021లో 21 వేల మందికి కొత్తగా జాబ్స్ ఇచ్చింది. ఇలా భారీగా నియామకాలు చేపట్టిన ఆయా కంపెనీలన్నీ… ఆర్థిక మాంద్యాన్ని బూచిగా చూపి ఉద్యోగుల తొలగింపు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని అంటున్నాయి.

ఆపిల్ మాత్రం అన్ని కంపెనీలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కొత్త నియామకాల విషయంలో 2016 నుంచి ఒకే తరహా పద్ధతిని అనుసరిస్తోంది. కరోనా సమయంలో ఇతర కంపెనీలతో పోలిస్తే ఆపిల్ వృద్ధి రేటు తక్కువగా నమోదైంది. అందుకే 2020లో 10 వేల మందిని, 2021లో ఏడు వేల మందిని మాత్రమే ఆపిల్ కొత్తగా నియమించుకుంది. నిరుడు సెప్టెంబరు నాటికి కార్పొరేట్‌, రిటైల్‌ ఉగ్యోగులు కలిపి ఆపిల్‌ కంపెనీలో 1,64,000 మంది పనిచేస్తున్నారు. అతి తక్కువగా నియామకాలు చేపట్టినందు వల్లే ఆపిల్‌కు ఉద్యోగుల్ని తొలగించాల్సిన అవసరం లేకుండా పోయిందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ నియామకాల్లో తొలి నుంచీ ఆపిల్ తెలివైన నిర్ణయాలు తీసుకుంటోందని కొనియాడుతున్నారు.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×