BigTV English

Padmanabha:-తిరుపతి శ్రీవారిని మించిన పద్మనాభుడు

Padmanabha:-తిరుపతి శ్రీవారిని మించిన పద్మనాభుడు

Padmanabha:-శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన పద్మనాభ స్వామి ఆలయంలో ఆరోగది రహస్యం రహస్యాంగానే ఉండిపోయింది. 2011లో ఐదు గదులు తెరిచినా ఆరోగదికి ఉన్న నాగబంధనంతో ముందుకు వెళ్లలేదు. దీంతో ఆరో గదిలో ఏముందనేది ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అంతులేని బంగారు సంపదతో లో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవళిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్ర చర్చనీయాంశమైంది. కొన్ని లక్షల కోట్లు విలువ ఉంటుందని అంచనా వేశారు


ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్ల భాగవతం పేర్కోటోంది. స్వామివారి గురించి 12 మంది అళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనులు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్ధిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్యపూజలు అందుకున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్ కోర్ రాజకుంటుబం ఏలుబడిలో ఈ ఆలయం ఉంది.

స్వామివారి మూలవిరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్ కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ కాలంలో 4 వేల మంది శిల్పకారులు, 6 వేల మంది కార్మికులు, 100 ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది.


Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×