RRB ALP Result 2025: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) నిర్వహించిన అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 9,970 పోస్టులకు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష(CBAT) ఫలితాలను ఆర్ఆర్బీ ప్రకటించింది. ఫలితాలు అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా జులై 15 నుండి ఆగస్టు 31, 2025 వరకు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు.
ఆర్ఆర్బీ వెబ్ సైట్లలో అభ్యర్థుల రోల్ నంబర్‌లను ఉంచారు. తాత్కాలిక షార్ట్ లిస్ట్ లో పేర్లు ఉన్న వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థులు రెండు సెట్ల స్వీయ ధృవీకరణ ఫొటో కాపీలతో పాటు ఒరిజినల్ పత్రాలను సమర్పించాలి.
1. ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్ https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281 ను సందర్శించండి.
2. హోమ్ పేజీలోని ‘RRB ALP ఫలితం 2025’ లింక్‌పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు రోల్ నంబర్‌లను చెక్ చేసుకునేందుకు PDF ఫైల్ డౌన్ లోడ్ చేసుకోండి.
4. తదుపరి అవసరం కోసం పీడీఎఫ్ హార్డ్ కాపీని తీసుకోండి.
ఏఎల్పీ ఫలితాలతో పాటు కట్ ఆఫ్‌లు కూడా విడుదల చేశారు. సీబీఏటీ స్కోర్ కార్డు అక్టోబర్ 1, 2025 రాత్రి 7 గంటల నుంచి 15 రోజుల వరకు ఆర్ఆర్బీ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.
అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో ఆర్ఆర్బీ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి సీబీటీ-1, కాంపోజిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. అర్హత సాధించడానికి అభ్యర్థులు ప్రతి టెస్ట్ బ్యాటరీ పరీక్షలో 42 టీ-స్కోర్‌ను పొందాలి.
ఆర్ఆర్బీ ఏఎల్పీ సీబీఏటీ స్కోర్‌కార్డును రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబర్ 1, 2025న విడుదల చేసింది. ఇందులో టెస్ట్ బ్యాటరీ వారీగా టీ-స్కోర్లు, కాంపోజిట్ టీ-స్కోర్, 30 శాతం వెయిటేజీ సంబంధించిన స్కోర్ ఉంటాయి. ఏఎల్బీ టెస్ట్ స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఉపయోగించి ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు.
తుది ఏఎల్పీ స్కోరును CBT-2లో సాధించిన మార్కులకు 70% వెయిటేజీ ఇస్తారు. CBAT-1లో సాధించిన మార్కులకు 30% వెయిటేజీ ఇస్తారు. తుది మార్కులను 100 మార్కులకు నార్మలైజేషన్ చేస్తారు. వీటిని షార్ట్‌లిస్టింగ్ చేసి కటాఫ్ ను ప్రకటించారు.