BigTV English

Samantha: బన్నీ AA 22 లో సమంత స్పెషల్ రోల్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Samantha: బన్నీ AA 22 లో సమంత స్పెషల్ రోల్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Samantha: అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. AA 22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప 2(Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కానున్న నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తుంది.


భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన సామ్..

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha)ప్రత్యేకమైన పాత్రలో నటించబోతోంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చిత్ర బృందం సమంతను కలిసి ఆమెతో సంప్రదింపులు చేయగా సమంత కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ పాత్రలో నటించడం కోసం సమంత ఏకంగా రూ.3 కోట్ల డిమాండ్ చేసిందనే వార్తలు కూడా వినపడుతున్నాయి. మరి సమంత అల్లు అర్జున్ సినిమాలో భాగం కావడం గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం ఈ విషయంపై అధికారకంగా స్పందించాల్సి ఉంటుంది.

ప్రత్యేక పాత్రలో సమంత..

ఇకపోతే ఈ సినిమాలో మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. దీపిక పదుకొనేతో పాటు, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందన్న వంటి తదితరులు ఈ సినిమాలో భాగమైనట్లు తెలుస్తోంది. రష్మిక ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించటం విశేషం. ఇక తాజాగా ఈ ప్రాజెక్టులో సమంత కూడా భాగం కాబోతున్నారనే వార్త బయటకు రావడంతో సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇదివరకు సమంత, అల్లు అర్జున్ కాంబినేషన్లో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


అల్లు అర్జున్ తో స్పెషల్ స్టెప్పులు..

ఇక ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. “ఉ అంటావా మావా ఊఊ అంటావా మావ” అనే పాటలో అల్లు అర్జున్ తో కలిసి స్పెషల్ స్టెప్పులు వేస్తూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.. అయితే ఇటీవల కాలంలో సమంత తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఈమె చివరిగా వెండితెరపై నటుడు విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ సినిమా తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు. ఇండస్ట్రీలో ఈమె బిజీ అవుతున్నప్పటికీ పూర్తిగా వెబ్ సిరీస్ ల పైన ఫోకస్ పెట్టారు. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సమంత ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Narne Nithin Wedding: పెళ్లి పీటలెక్కబోతున్న ఎన్టీఆర్ బామ్మర్ది… ముహూర్తం డేట్ ఎప్పుడంటే?

Related News

OG Success Event : ప్రియాంక మోహన్ బట్టలపై తమన్ షాకింగ్ కామెంట్స్

Akhanda 2 : పోటాపోటీగా చిరు, బాలయ్య సినిమా అప్డేట్స్, ఫైట్ కొనసాగుతుందా?

Balakrishna: బాలయ్య బ్రాండ్ కొత్త యాడ్ వీడియో… AI తో మ్యానేజ్ చేశారా ఏంటి?

MSVPG : మన శంకర వరప్రసాద్ గారు దసరా సర్ప్రైజ్ ఫస్ట్ లుక్..పోస్టర్ వైరల్!

Narne Nithin Wedding: పెళ్లి పీటలెక్కబోతున్న ఎన్టీఆర్ బామ్మర్ది… ముహూర్తం డేట్ ఎప్పుడంటే?

Mass Jathara Release :చివరికి హీరో కూడా చింటూ అనేశాడు… ఫైనల్ గా మాస్ జాతర రిలీజ్ డేట్ వచ్చేసింది

Allu Sirish engagement : రూమర్స్ నిజమే.. ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన అల్లు శిరీష్.. ఎప్పుడంటే?

Big Stories

×