డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అమెరికా అతలాకుతలం అవుతోంది. ఎప్పటికప్పుడు షాకింగ్ నిర్ణయాలు తీసుకంటూ మిత్ర దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తున్నారు. తాజాగా ఏకంగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయ్యింది. ఫండింగ్ బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం మూతపడింది. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఈ నిర్ణయం విమానాలు, వీసాలతో పాటు ట్రావెలింగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయినా, విమానాలు నడుస్తూనే ఉంటాయి. అయితే, విమానయాన రంగంపై ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే, చాలా మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) సిబ్బంది సాలరీ లేకుండా పని చేయాల్సి ఉంటుంది. వారిలో చాలా మంది రాజీనామా చేయవచ్చు, దీనివల్ల సిబ్బంది కొరత ఏర్పడుతుంది. గత షట్ డౌన్లలో చూసినట్లుగా, సిబ్బంది కొరత తీవ్ర సమస్యలకు కారణం కావచ్చు. అటు ఆయా విమానాల ఆలస్యం, రద్దులపై ఇంకా ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ, సిబ్బంది కొరత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మరోవైపు, ప్రభుత్వ షట్ డౌన్ ఉంటే రైళ్లు ప్రభావితం కావు. రైళ్లు యథావిధిగా నడుస్తాయి. అమెరికా అంతటా సేవలు కొనసాగుతాయి. ఆలస్యం, రద్దు లాంటివి ఉండవని అధికారులు తెలిపారు.
షట్‌డౌన్ సమయంలో కాన్సులర్ సేవలపై ఎటువంటి ప్రభావం ఉండదు. అందువల్ల, వీసా అపాయింట్ మెంట్ తీసుకోవాలనుకుంటున్నవారు, ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న వారు తమ ప్రణాళికలను కొనసాగించవచ్చు. అమెరికాతో పాటు విదేశాలలో కాన్సులర్ సేవలలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ కారణంగా ప్రయాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. US ట్రావెల్ ప్రకారం, ట్రావెలింగ్ ఇండస్ట్రీ వారానికి 1 బిలియన్ డాలర్లు నష్టపోవచ్చు. అనవసరమైన అన్ని ఫెడరల్ సేవలు పాజ్ చేయవలసి ఉంటుంది. నేషనల్ పార్క్ లు మూసివేయబడుతాయి. ఈ నిర్ణయం చాలా మందికి ప్రయాణ ప్రణాళికలను దెబ్బతీస్తుంది.
⦿ అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ నేపథ్యంలో విమానాలు రద్దు అవుతాయా?
విమానాలు నడుస్తూనే ఉంటాయి. కానీ. సిబ్బంది కొరతతో కొన్ని విమానాలు ఆలస్యం కాగా, మరికొన్ని రద్దయ్యే అవకాశం ఉంటుంది.
⦿ ఆమ్ ట్రాక్ లాంటి రైళ్లు షట్ డౌన్ వల్ల ప్రభావితమవుతాయా?
లేదు, ఆమ్ ట్రాక్ సాధారణంగా నడుస్తూనే ఉంటుంది. ఇది స్వతంత్ర ఏజెన్సీగా పనిచేస్తుంది. దాని సేవలకు షట్ డౌన్ అంతరాయం కలిగించదు.
⦿ వీసా అపాయింట్‌మెంట్, అంతర్జాతీయ ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేయాలా?
అమెరికాతో పాటు విదేశాలలో పాస్ పోర్ట్, వీసా సేవలు షట్‌డౌన్ సమయంలోనూ కొనసాగుతాయని స్టేట్ డిపార్ట్ మెంట్ ధృవీకరించింది. సో, రీ షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు.
Read Also: గంటలో దుబాయ్‌కు ప్రయాణం.. ఎతిహాద్ హైస్పీడ్ రైల్ వచ్చేస్తోంది!