E-Paper
Advertisement

Jobs: 10 పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. ఎగ్జామ్ లేదు గురూ.. సైకిల్ తొక్కడం రావాలి..

Jobs: 10 పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. ఎగ్జామ్ లేదు గురూ.. సైకిల్ తొక్కడం రావాలి..
Advertisement
jobs

jobs: ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎంతో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. వందల్లో ఖాళీలు.. లక్షల్లో అభ్యర్థులు. జాబ్ కొట్టాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. మెరిట్ ఉండాలి. పరీక్ష పాసవ్వాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. అయితే, ఇలాంటి తతంగమేమీ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. జస్ట్ పదో తరగతి పాస్ అయితే చాలు. మెరిట్ ఉంటే జాబ్ వచ్చినట్టే. అంతే. ఇంతే సింపుల్.

తపాలా శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీలు భర్తీ చేయనున్నారు. టెన్త్ మార్క్స్‌లో మెరిట్‌తో నియామకాలు చేపట్టనున్నారు. సెలెక్ట్ అయితే, బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Advertisement

–మొత్తం పోస్టులు 12,828. ఏపీలో 118, తెలంగాణలో 96 ఖాళీలు.
–పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు.
–ఏపీ, తెలంగాణ అభ్యర్థులు టెన్త్ వరకు తెలుగును ఓ సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
–కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సైకిల్‌ తొక్కటం రావాలి.
–జూన్ 11 నాటికి 18-40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు.

–బీపీఎం పోస్టులకు నెలకు 12,000-29,380 జీతం, ఏబీపీఎం పోస్టులకు 10,000-24,470 వేతనం.
–మే 22 నుంచి జూన్‌ 11 వరకు దరఖాస్తు గడువు.
— https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×