E-Paper
Advertisement

SSC Recruitment: ఎస్ఎస్‌సీ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఈ అర్హత ఉంటే సరిపోతుంది, పూర్తి వివరాలివే..

SSC Recruitment: ఎస్ఎస్‌సీ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఈ అర్హత ఉంటే సరిపోతుంది, పూర్తి వివరాలివే..
Advertisement

SSC Constable: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఇంటర్ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. నెలకు రూ.21,700- రూ.69,100 వరకు వేతనం ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఢిల్లీ (SSC) ద్వారా 737 కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన పురుషులు అభ్యర్థులు అక్టోబర్‌ 15 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 737

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో మొత్తం 737 డ్రైవర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వివరాలు

కానిస్టేబుల్ (డ్రైవర్) : 737 పోస్టులు

విద్యార్హత: ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెవీ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగ ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఎగ్జామ్ ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 25

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 15

కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్: 2025 డిసెంబర్, 2026 జనవరి నెలల్లో ఉండే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రందించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.21,500 నుంచి రూ.69,100 జీతం ఉంటుది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 737

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 15

ALSO READ: Canara Bank: డిగ్రీ అర్హతతో 3500 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పోస్టులు, అప్లై విధానం ఇదే..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×