BigTV English
Advertisement

RRB Group-D: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇలా చదివితే ఉద్యోగం మీదే గురూ, రోజుకు 5 గంటలు చాలు..!

RRB Group-D: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇలా చదివితే ఉద్యోగం మీదే గురూ, రోజుకు 5 గంటలు చాలు..!

RRB Group-D: నిరుద్యోగులకు ఇది బిగ్ అలర్ట్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 32 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబందించిన డేట్స్ కూడా ఆర్ఆర్‌బీ ప్రకటించింది.  గ్రూప్ -డీ ఎగ్జామ్స్ నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు నిర్వహించనున్నట్టు రైల్వే బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎగ్జామ్ కు పది రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్, డేట్ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయని వివరించింది. గ్రూప్ డీ అభ్యర్థులు అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్ సైట్ ను ఫాల్లో కావాలని తెలిపింది. చాలా మంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు. నాలుగైదు సంవత్సరాలకు ఓసారి పడే గ్రూప్-డీ ఉద్యోగాలకు పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగం మీ సొంతం అవుతోంది.


ఎగ్జామ్ డేట్స్: నవంబర్ 17 నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు..

సికింద్రాబాద్ జోన్‌లో 1600 పోస్టులు


గ్రూప్-డీ నోటిఫికేషన్ లో వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయి. పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి తదితర ఉద్యోగాలు ఉన్నాయి. మన సికింద్రాబాద్‌ జోన్‌లో 1600కు పైగా పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు పోటీ భారీగానే ఉంటుంది. సరైన ప్రణాళిక వేసుకుని చదివితే ఉద్యోగం సాధించండం ఈజీ అవుతోంది.

ఉద్యోగ ఎంపిక విధానం ఇదే…

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

గ్రూప్-డీ సెలబస్ ఇదే..

RRB గ్రూప్-డీ పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా RRB గ్రూప్ D సిలబస్‌ని ఓసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి. మ్యాథ్స్, జీఎస్, జనరల్ సైన్స్, రీజనింగ్ వంటి ప్రశ్నలు ఉంటాయి.

*మ్యాథ్స్

*జీఎస్

*జనరల్ సైన్స్

*రీజనింగ్

NOTE: మొత్తం 100 ప్రశ్నలకు గానూ 90 నిమిషాల సమయం ఉంటుంది. నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

అభ్యర్థులు పరీక్షలో అడిగే ప్రశ్నల సడిలిని తెలుసుకోవడానికి ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ చేయవచ్చు. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే సులభంగా ఉద్యోగం సాధించవచ్చు. ఇప్పటి నుంచి నిత్యం ప్రాక్టిస్ టెస్ట్ లు రాస్తే ఫైనల్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేయవచ్చు.

IMPORTANT: రోజు ప్రాక్టీస్ టెస్ట్ లు రాస్తే ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

మ్యాథ్స్:

RRB గ్రూప్ D మ్యాథ్స్ నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. మ్యాథ్స్ పరీక్ష కీలక పాత్రను పోషిస్తుంది. కొంచెం రోజు వారీగా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు చేయవచ్చు. సంఖ్యా వ్యవస్థ, బోడామస్, దశాంశాలు అండ్ భిన్నాలు, సగటు, కసాగు-గసాభా, శాతాలు, కాలం-పని, లాభ-నష్టాలు, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, వయస్సు మీద లెక్కలు, క్యాలెండర్, గడియారం నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. మూడు నెలల పాటు రోజు వీటిపై సాధన చేస్తే 25 మార్కులకు గానూ 20 మార్కులు ఈజీగా సాధించవచ్చు.

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్:

గ్రూప్-డీ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు రావొచ్చు. కోడింగ్, డీకొడింగ్, రిలేషన్స్, జంబ్లింగ్, డేటా ఇంటర్ ప్రెటేషన్, ప్రకటనలు-వాదనలు, సిలాజజం, వెన్ డియాగ్ర్స్, తీర్మాణాలు-నిర్నయాలు, అనలిటికల్ రీజనింగ్, దిశలు నుంచి ప్రశ్నలు వస్తారు. రోజు వారీగా ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్ మంచి మార్కులు చేయవచ్చు. ఇందులో బాగా సాధన చేస్తే 25 మార్కులు పొందవచ్చు.

జనరల్ సైన్స్:

జనరల్ సైన్స్ కోసం టెన్త్ క్లాస్ స్థాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ చదవాలి. ఫిజిక్స్ నుంచి 7-8 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 9-10 మార్కులు, బయాలజీ నుంచి 6-7 మార్కులు వస్తాయి. టెన్త్ క్లాస్ స్థాయి పుస్తకాలు చదివితే మంచి మార్కులు పొందవచ్చు.

జనరల్ అవేర్‌నెస్:

జనరల్ అవేర్నెస్ విభాగంలో కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని 20 ప్రశ్నలు వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, వ్యక్తులు, ఎకానమీ, పొలిటికల్ తదితర విషయాలపై ప్రశ్నలు అడుగుతారు. వన్ ఇయర్ నుంచి కరెంట్ అఫైర్స్ చదివితే మంచి స్కోర్ చేయవచ్చు.

ALL THE BEST..

పై సిలబస్ ను రెండు, మూడు సార్లు రివిజన్ చేసి చదవిండి. బాగా చదవండి. రోజు టెస్ట్ లు రాయండి. మీకు ఉద్యోగం రావాలని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్.

ALSO READ: SSC Constable: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.81,000 జీతం.. ఇదే మంచి అవకాశం బ్రో

Related News

TGPSC Group 3: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 10 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

IRCTC Recruitment 2025: IRCTCలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు, ఆ డిగ్రీ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

NABARD Notification: నిరుద్యోగులకు శుభవార్త.. నాబార్డులో ఆఫీసర్స్ ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

BEML Notification: భారత్ ఎర్త్ మూవర్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40000.. ఇంకెందుకు ఆలస్యం

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

Big Stories

×