APMSRB: ఏపీ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎంబీబీఎస్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, తదితర వాటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) కాంట్రాక్ట్ విధానంలో ఏపీ వైద్య & కుంటుంబ సంక్షేమ శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 538 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 538
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ పాసై ఉండాలి. ఎపీఎంసీలో రిజిస్ట్రేషన్ ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను పరిగణలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 11
దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 3
వయస్సు: ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 47 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఇతరులకు 50 నుంచి 52 ఏళ్లు ఉండాలి.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. రూ.61,960 జీతం నుంచి రూ.1,51,370 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://apmsrb.ap.gov.in/msrb/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 538
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 3