E-Paper
Advertisement

Canara Bank: డిగ్రీ అర్హతతో 3500 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పోస్టులు, అప్లై విధానం ఇదే..

Canara Bank: డిగ్రీ అర్హతతో 3500 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పోస్టులు, అప్లై విధానం ఇదే..
Advertisement

Canara Bank: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. కెనరా బ్యాంక్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కెనరా బ్యాంక్ (Canara Bank), ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉన్న ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కు 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు భర్తీకి చేసుందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 12 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3500

తెలుగు రాష్ట్రాల్లో వెకెన్సీలు..

Advertisement

తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వెకెన్సీలు ఉన్నాయి. ఏపీలో 242, తెలంగాణలో 132 ఖాళీలున్నాయి.

ఆంధ్రప్రదేశ్: 242 పోస్టులు

తెలంగాణ: 132 పోస్టులు

పోస్టుల వివరాలు..

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ షిప్ పోస్టులు: 3500 పోస్టులు

కేటగిరీ వారీగా పోస్టులు

ఎస్సీ: 557 పోస్టులు

ఎస్టీ: 227 పోస్టులు

ఓబీసీ: 845 పోస్టులు

ఈడబ్ల్యూఎస్: 337 పోస్టులు

యూఆర్: 1534 పోస్టులు

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీన నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. 2022 జనవరి 1 నుంచి 2025  సెప్టెంబర్ 1 మధ్యలో డిగ్రీ పాసై ఉండాలి.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుకు ప్రారంభ తేది: సెప్టెంబర్ 22

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 12

వయస్సు: 2025 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల వయస్సు మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. బీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ట్రైనింగ్ పీరియడ్: వన్ ఇయర్ ఉంటుంది.

స్టైఫండ్: నెలకు రూ.15000 స్కాలర్ షిప్ అందజేస్తారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్, డిప్లొమా పాసై ఉండాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానిక భాషలో పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://canarabank.bank.in/pages/Recruitment

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నెలకు రూ.15000 స్కాలర్ షిప్ అందజేస్తారు. ఇలాంటి మంచి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. దరఖాస్తుకు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3500

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 12

ALSO READ: IB Recruitment: టెన్త్ క్లాస్‌తో ఐబీలో భారీగా ఉద్యోగాలు.. రూ.69,100 జీతం, దరఖాస్తుకు ఇంకా 3రోజులే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×