Big Stories

పంచ మహాపాతకాలు చేస్తే పడే శిక్షలివే.!

సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. యమదూతలు వీరి సాక్ష్యముతో విచారించి పాపాల లెక్క చూసి దండిస్తారు. వేదమార్గమును వదలి ఇష్టానుసారంగా తిరుగుతూ వేదశాస్త్రములను ధూషించవానికి సాధు బహిష్కృతుడు దండన ఎదుర్కొనేవారిలో ముందుంటారు. బ్రాహ్మణుని, గురువును, రోగిని కాలితో తన్నువాడు, తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడే వారు శిక్షార్హులే. నిత్యము అబద్ధమాడుతూ జంతువులను చంపతూ కులాచారములను వదిలిన వారికి శిక్షలు తప్పవని శాస్త్రం చెబుతోంది.

- Advertisement -

దానం చేసిన సొమ్మును తిరిగి తీసుకుంటే పాపం చేసినట్టే లెక్కే. పరుని భార్యపై కన్నేసిన వాడు, డబ్బుల కోసం అబద్దపు సాక్ష్యాలు చెప్పే వారు ఈ జాబితాలో ఉంటారు. అంతే కాదని తాను దాతనని చెప్పుకొనువాడు,, మిత్రద్రోహి, సాయం చేసే వాడికి అపకారం చేసే వాళ్లు తప్పు చేసిన వాల్లే . చెరువును, నూతిని, చిన్న కాలువల కూడా కబ్దాలు చేసే వాళ్లు యమదూతలు వదిలిపెట్టరు. పితృదేవతకు కనీసం పిండం పెట్టకుడా నిత్యకర్మను వదలిన వారిని యమలోకంల దండిస్తారట. ఇతరులకి దానం చేసే సమయంలో వద్దని పక్కనే వారించే వాళ్లు దానం చేయమని యాచించిన బ్రాహ్మణుకి భిక్ష కూడా వేయడని వాడు పాపాత్ముడే.

- Advertisement -

కాపాడమని వేడుకున్న వాడని చంపే వ్యక్తిని క్షమార్హుడు కాదు. అశ్వహంతకులు, గోహంతకులు కూడా యమలోకంలో నరకయాతన తప్పదు. బ్రాహ్మణుని వంశమందు పుట్టి దాసీ సంగలోలుడై పాపములు చేసే వాడు శిక్షార్హుడే . సర్వభూతములందు దయ, జాలి ఉన్న వ్యక్తి యమలోకమును పొందడు. సత్యవంతుడై అసూయ దోషరహితుడైన వ్యక్తి యమదండార్హుడుగాడు. అన్నదానం చేసే వాళ్లు, నీళ్లు దానం, గోదానం చేసే వాళ్లకి ఎలాంటి శిక్షలు ఉండవు. చదువుకునేందుకు సహాయపడిన వాళ్లు, పరోపకారం చేసే వాళ్లు యమలోకమును పొందరు. దిక్కులేని శవాలకు మంత్ర సంస్కారం చేసేవాళ్లు పుణ్యం సంపాదించినట్టే.

కాశీలోని మణికర్ణికా ఘాట్ లో మృతి చెందిన వాళ్లు సర్వపాపాలు చేసినా యమలోకము ప్రాప్తించదు. దొంగ, కల్లుత్రాగువాడు, మిత్రహంతకుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య, చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన యెడల పాపవిముక్తులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. మరణావస్థలో ఉన్నవాడు హరినామస్మరణ చేస్తే పాపములన్ని అగ్నిలోనుంచిన దూదివలె నశించును..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News